సంక్రాంతికి రాజమౌళి మల్టీ స్టారర్ మూవీ ప్రకటన .. ఎన్టీఆర్ - చరణ్ లకు ఆయన ఆ మాట చెప్పేశాడట!
Add ap7am to your home Screen

సంక్రాంతికి రాజమౌళి మల్టీ స్టారర్ మూవీ ప్రకటన .. ఎన్టీఆర్ - చరణ్ లకు ఆయన ఆ మాట చెప్పేశాడట!

  • మల్టీ స్టారర్ మూవీ కోసం కథ సిద్ధం 
  • స్క్రిప్ట్ పై దృష్టి పెట్టిన రాజమౌళి 
  • అక్టోబర్లో సెట్స్ పైకి వెళ్లే ఆలోచన
ఎన్టీఆర్ .. చరణ్ లతో రాజమౌళి ఒక మల్టీ స్టారర్ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి హీరోల ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేశారు. ఇద్దరి పాత్రలకు సమానమైన ప్రాధాన్యత వుందా .. లేదా అనే విషయాన్ని ఒకటికి రెండు మార్లు రాజమౌళి చెక్ చేసుకున్నారట. తాజాగా పూర్తిస్థాయి కథను రాజమౌళి ఓకే చేసి, స్క్రిప్టు పై దృష్టి పెట్టారని అంటున్నారు.

సంక్రాంతికి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన చేయనున్నారని సమాచారం. ఈ ప్రాజెక్టును ఆయన అక్టోబర్లో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు చెబుతున్నారు. దాదాపు 10 నెలల పాటు నిర్విరామంగా ఈ సినిమా షూటింగ్ కొనసాగనుందని అంటున్నారు. బోయపాటితో చరణ్ .. త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ చేసే సినిమాలు, అక్టోబర్ నాటికి పూర్తయ్యేలా చూసుకోమని ఇద్దరు హీరోలకి రాజమౌళి చెప్పారట. ఈ సినిమాలో హీరోయిన్స్ గా ఎవరికి ఛాన్స్ దొరుకుతుందో చూడాలి.       
charan
ntr

More Telugu News