ఎన్టీఆర్ కోసం హాలీవుడ్ ఫిట్ నెస్ కోచ్
Add ap7am to your home Screen

ఎన్టీఆర్ కోసం హాలీవుడ్ ఫిట్ నెస్ కోచ్

  • త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ 
  • ఎన్టీఆర్ కి 28వ మూవీ 
  • న్యూ లుక్ కోసం కసరత్తు
ఎన్టీఆర్ తన తదుపరి సినిమాను త్రివిక్రమ్ తో చేయనున్నాడు. ఈ సినిమాలో పాత్ర పరంగా ఆయన కాస్త స్లిమ్ గా ఫిట్ నెస్ తో కనిపించనున్నాడు. అందుకోసం హాలీవుడ్ ఫిట్ నెస్ కోచ్ 'లాయిడ్ స్టీవెన్స్' ను రప్పించారు. ఆయన పర్యవేక్షణలో ఎన్టీఆర్ బరువు తగ్గడానికి .. ఫిట్ నెస్ ను పెంచుకోవడానికి గట్టిగానే కసరత్తు చేస్తున్నాడు.

న్యూ లుక్ తో ఎన్టీఆర్ ఈ సినిమాలో కనిపించనుండటంతో, ఆయన అభిమానులంతా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే సమయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'అజ్ఞాతవాసి' రిలీజ్ తరువాత కొన్ని రోజుల పాటు బ్రేక్ తీసుకుని ఈ సినిమాను త్రివిక్రమ్ మొదలుపెడతారని అంటున్నారు. హారిక హాసిని బ్యానర్లో రాధాకృష్ణ నిర్మించనున్న ఈ సినిమాలో, కథానాయిక ఎవరనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఎన్టీఆర్ 28వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా, త్రివిక్రమ్ మార్క్ తోనే ఉంటుందని అంటున్నారు.      
ntr
trivikram

More Telugu News