'సాక్ష్యం'లో ఆ సీన్ హైలైట్ అవుతుంది: బెల్లంకొండ శ్రీనివాస్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సాక్ష్యం'లో ఆ సీన్ హైలైట్ అవుతుంది: బెల్లంకొండ శ్రీనివాస్

  • 'సాక్ష్యం' కోసం బరువు తగ్గాను 
  • సైక్లింగ్ సీన్ అదిరిపోతుంది 
  • పీటర్ హెయిన్స్ ఫైట్స్ చూసి తీరాల్సిందే
బెల్లంకొండ శ్రీనివాస్ తాజా చిత్రంగా 'సాక్ష్యం' రూపొందుతోంది. శ్రీవాస్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ రోజున బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టినరోజు కావడంతో ఈ సినిమాను గురించి ఆయన ప్రస్తావించాడు. "శ్రీవాస్ మేకింగ్ స్టైల్ నాకు బాగా నచ్చింది .. ఆయన దర్శకత్వంలో నటించే ఛాన్స్ రావడం నా అదృష్టం. ఇక యువ కథానాయకులు కోరుకునే మాస్ ఇమేజ్ నాకు చాలా ముందుగా రావడం కూడా అదృష్టంగానే భావిస్తున్నాను" అన్నాడు.

" సాక్ష్యం సినిమా కోసం ఎంతో కసరత్తు చేసి బరువు తగ్గాను. ఈ సినిమాలో బి.ఎమ్.ఎక్స్. సైక్లింగ్ ను చూపించనున్నాం. నుంచునే తొక్కడం ఈ సైకిల్ ప్రత్యేకత. అయిదు రోజుల పాటు నేను ఈ సైకిల్ ను నుంచుని తొక్కవలసి వచ్చింది. సినిమాలో ఈ సీన్స్ ఉత్కంఠను రేకెత్తిస్తాయి. అలాగే పీటర్ హెయిన్స్ కంపోజ్ చేసిన ఫైట్స్, మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటాయి" అని చెప్పుకొచ్చాడు.      
srinivas
pooja hegde

More Telugu News