ఆ బాల్ దెబ్బా? మజాకా?: భయంతో నెక్ట్స్ బాల్ కు హేస్టింగ్స్ ఔట్!
- హేస్టింగ్స్ తలను తాకిన బెన్ కటింగ్ బౌన్సర్
- హెల్మెట్ ఉండటంతో బతికిపోయిన హేస్టింగ్స్
- తరువాతి బంతికే పెవిలియన్ కు!
బాల్ ధాటికి హేస్టింగ్స్ హెల్మెట్ ఎగిరి పడింది. ఆ బాల్ కు హేస్టింగ్స్ కు ఎలాంటి గాయమూ కాలేదు. ఇక అదే హెల్మెట్ లేకుంటే తనకేం జరిగేదన్న భయం మదిలో ఉండిపోయిందేమో, తరువాతి బంతికే ఆయన పెవిలియన్ చేరాడు. కాగా, మూడు సంవత్సరాల క్రితం బ్యాట్స్ మెన్ ఫిల్ హ్యూస్, ఓ బౌన్సర్ తగిలి మైదానంలోనే కుప్పకూలి, ప్రాణాలు వదిలిన విషాద ఘటన తెలిసిందే.