కొత్త ఏడాది తొలి రోజున ఖాతాదారులకు శుభవార్త చెప్పిన ఎస్బీఐ
- 30 బేస్ పాయింట్లను తగ్గించిన ఎస్బీఐ
- గణనీయంగా తగ్గనున్న వడ్డీ రేట్లు
- 80 లక్షల మందికి లబ్ధి
ఎస్బీఐ తాజా నిర్ణయం సోమవారం నుంచే అమల్లోకి వచ్చింది. బేస్ పాయింట్లు తగ్గించినప్పటికీ అదనపు నిధుల సమీకరణ ఖర్చుల ఆధారంగా మంజూరు చేసే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు (ఎంసీఎల్ఆర్) ను మాత్రం 7.95 శాతం వద్ద అలాగే ఉంచింది.
కొత్తగా గృహ రుణాలు తీసుకునే వారికి, ఇతర బ్యాంకుల నుంచి గృహ రుణాలను ఎస్బీఐకి మార్చుకునే వారికి ఇచ్చే ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు గడువును మార్చి వరకు పొడిగించింది. కాగా, ఎస్బీఐ తాజా నిర్ణయంతో ఇతర బ్యాంకులు కూడా బేస్ పాయింట్లను తగ్గించనున్నట్టు తెలుస్తోంది.