మోదీ వల్లే నారా లోకేష్ కు 20 ప్రైజులు వచ్చాయి: బీజేపీ నేత సోము వీర్రాజు
- ఏపీ కోసం కేంద్రం ఎంతో చేస్తోంది
- మోదీ ఫొటో కూడా వేయడం లేదు
- రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కాకూడదా?
బీజీపీ బలపడుతున్న ప్రతిసారి ఏదో ఒక చోట ప్రత్యేక హోదా అంటున్నారని మండిపడ్డారు. ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్న తర్వాత కూడా... ప్రత్యేక హోదా అంటూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరంకు కేంద్రం అడ్డంకులు సృష్టిస్తోందంటూ ఎక్కడో ఒక చోట రచ్చ చేస్తున్నారని అన్నారు. ఏపీలో టీడీపీ బలోపేతం కావచ్చు కాని, బీజేపీ కాకూడదా? అని ప్రశ్నించారు. ఒక వేళ బీజేపీతో పొత్తు వద్దని భావిస్తే... ఆ విషయాన్ని చంద్రబాబు ఓపెన్ గా చెప్పాలని అన్నారు. ఇప్పుడున్నది ఆనాటి బీజేపీ కాదని, ఆనాటి నేతలు కూడా కాదని స్పష్టంగా చెప్పారు వీర్రాజు.