హైద‌రాబాద్ ఉస్మానియా వైద్య క‌ళాశాల‌లో రాజేశ్‌కు లైంగిక ప‌టుత్వ ప‌రీక్ష‌లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైద‌రాబాద్ ఉస్మానియా వైద్య క‌ళాశాల‌లో రాజేశ్‌కు లైంగిక ప‌టుత్వ ప‌రీక్ష‌లు

  • పెళ్ల‌యిన కొన్ని గంట‌ల‌కే భార్య‌ను చిత‌గ్గొట్టిన రాజేశ్‌
  • చిత్తూరు స‌బ్‌జైలు నుంచి రాజేశ్‌ను తీసుకొచ్చిన పోలీసులు
  •  లైంగిక ప‌టుత్వ ప‌రీక్ష‌ల అనంత‌రం మ‌ళ్లీ జైలుకి
పెళ్ల‌యిన కొన్ని గంట‌ల‌కే భార్య‌ను చిత‌గ్గొట్టి, ఆసుప‌త్రి పాలు చేసిన చిత్తూరు జిల్లా గంగాధ‌ర నెల్లూరుకు చెందిన రాజేశ్‌.. తాను సంసారానికి ప‌నికిరాన‌ని విచార‌ణ‌లో చెప్పిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో చిత్తూరు జిల్లా కోర్టు రాజేశ్ కు లైంగిక ప‌టుత్వ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని కూడా ఆదేశించింది. నిన్న రాజేశ్‌ను చిత్తూరు స‌బ్‌జైలు నుంచి హైద‌రాబాద్‌లోని ఉస్మానియాకు త‌ర‌లించారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ ఉస్మానియా వైద్యులు రాజేశ్‌కు లైంగిక ప‌టుత్వ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. అనంత‌రం రాజేశ్‌ను మ‌ళ్లీ జైలుకు త‌ర‌లిస్తారు.
rajesh
chittoor
Hyderabad

More Telugu News