పెళ్లి తరువాత చాదస్తం పెరిగిపోయింది: సమంత
- ఇటీవలే అక్కినేని వారింటికి కోడలిగా వెళ్లిన సమంత
- నచ్చని సినిమాల్లో తప్పులు వెతుకుతున్న సమంత
- చాదస్తం ఎక్కువైందని వాపోతున్న మిస్సెస్ నాగచైతన్య
తన స్వేచ్ఛను కోల్పోవాల్సిన అవసరం రాలేదన్న సమంత, ఏదైనా కథ వింటే తప్పులు వెదికే వైఖరి మరింతగా పెరిగిపోయిందని చెప్పింది. పెళ్లి ముందు కాస్త నచ్చని కథలు తన ముందుకు వచ్చినప్పుడు, 'అది నచ్చలేదు, ఇది నచ్చలేదు' అంటూ చెబుతుండేదాన్నని, ఇప్పుడు ఆ చాదస్తం ఎక్కువైందని వాపోయింది. మంచి సినిమాలు చేతిలో ఉండటం వల్లే నచ్చని కథలను అలా వదిలేస్తున్నానని అంటోంది సమంత.