టాస్ గెలిచిన శ్రీలంక, భారత్ బ్యాటింగ్
- ఇండియాకు బ్యాటింగ్ అప్పగించిన లంక
- దలైలామాను కలిసిన లంక క్రికెటర్లు
- కోహ్లీ గైర్హాజరుతో రోహిత్ కెప్టెన్సీ
విరాట్ కోహ్లీ సెలవు తీసుకోవడంతో, రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు బరిలోకి దిగుతోంది. వరుసగా ఏడు సిరీస్ లను గెలిచిన భారత టీమ్, ఈ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేస్తే, వరల్డ్ నంబర్ వన్ గా నిలుస్తుంది. మరికాసేపట్లో భారత బ్యాటింగ్ ప్రారంభమవుతుంది. కాగా, అంతకుముందు మ్యాచ్ లో తమకు విజయం దక్కాలని కోరుతూ లంక ఆటగాళ్లు దలైలామాను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.