'పవన్ కల్యాణ్ దేవుడు' అంటే మెంటల్ డాక్టరే దిక్కు: కత్తి మహేశ్
- అభిమానుల్లో ఉన్మాదం పెరుగుతోంది
- తెరపై మాత్రమే హీరోలు
- జనసేనలో పవన్ తప్ప ఎవరున్నారు?
- సైనికులను చూపడం లేదన్న కత్తి మహేశ్
పవన్ ను దేవుడిగా కొలుస్తున్న వాళ్లలో ఉన్మాదం ఎక్కువగా ఉన్నట్టని, ఇది సమాజానికి చెడు చేస్తుందని తెలిపాడు. మిగతా హీరోలతో పోలిస్తే పవన్ అభిమానుల్లో ఉన్మాదం అధికంగా కనిపిస్తోందని ఓ చానల్ నిర్వహించిన చర్చలో మహేష్ వ్యాఖ్యానించాడు. జనసేన పార్టీలో పవన్ తప్ప మరెవరూ లేరని, సేనలోని సైనికులు ఎవరో చూపించరని, వాళ్లపై ఒక్క కెమెరా కూడా ఫోకస్ కాదని ఆరోపణలు గుప్పించాడు.