పోలీసుల విచారణలో... శైలజపై అంత దారుణానికి కారణం చెప్పిన రాజేష్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పోలీసుల విచారణలో... శైలజపై అంత దారుణానికి కారణం చెప్పిన రాజేష్!

  • తొలిరాత్రి భార్యను హింసించిన రాజేష్
  • దాంపత్యానికి పనికిరాని రాజేష్
  • విషయం బయటకు చెప్పిందన్న అక్కసుతోనే
గంటల ముందు తాను కట్టుకున్న భార్య శైజలను అంత చిత్ర హింసలు పెట్టడానికి గల కారణాలను పోలీసులు తమదైన శైలిలో విచారించి రాజేష్ నుంచి రాబట్టారు. గంగాధర నెల్లూరుకు చెందిన రాజేష్‌ కు, శుక్రవారం నాడు వివాహం కాగా, తొలిరాత్రి భార్యను చిత్ర హింసలు పెట్టిన సంగతి సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

పోలీసు వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రభుత్వ టీచర్‌ గా విధులు నిర్వహిస్తున్న రాజేష్, దాంపత్య జీవితానికి పనికిరాడు. విషయాన్ని దాచిపెట్టి శైలజను పెళ్లి చేసుకున్నాడు. కట్న కానుకల కింద సుమారు కోటి రూపాయలు నొక్కేశాడు. శోభనం నాటి రాత్రి తన అసలు సంగతిని భార్య ముందు పెట్టి, విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని బతిమాలాడు. తన జీవితం నాశనం అయిపోయిందనే బాధతో శైలజ, బయటకు వచ్చి విషయం నలుగురికీ చెప్పింది.

ఆపై "సరదాగా అన్నానులే" అంటూ రాజేష్ బుకాయించగా తిరిగి గదిలోకి శైలజను పంపారు. తన రహస్యాన్ని నలుగురికీ చెప్పిందన్న ఆగ్రహం రాజేష్ ను నరరూప రాక్షసుడిని చేసింది. కేకలు పెట్టకుండా నోటిలో బట్టలు కుక్కి పిడిగుద్దలు గుద్దాడు. తలపై మోదాడు. ఇష్టమొచ్చిన చోటల్లా కొరికాడు. తీవ్ర గాయాల పాలైన శైలజ, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, రాజేష్ పోలీసుల అదుపులో ఉన్నాడు.
Rajesh
Sailaja
First Night

More Telugu News