సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
Add ap7am to your home Screen

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • డబ్బింగ్ చెప్పుకుంటున్న వైజాగ్ బ్యూటీ 
  • రాజమౌళి మల్టీ స్టారర్ 'యమధీర'?
  • అమెరికాలో అఖిల్ ప్రమోషన్ ప్లాన్స్ 
  • రెండున్నర దశాబ్దాల తర్వాత సూపర్ స్టార్ల కలయిక
*  అలియాస్ జానకి, గోపాల గోపాల, రన్, ఒక్కడు మిగిలాడు.. వంటి చిత్రాలలో నటించిన వైజాగ్ బ్యూటీ అనీషా ఆంబ్రోస్ తాజాగా 'పెళ్లిచూపులు' ఫేం తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తోంది. విశేషం ఏమిటంటే, తొలిసారిగా ఇందులో తన పాత్రకు తానే అనీషా డబ్బింగ్ చెప్పుకుంటోంది.
*  ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్లో ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఓ భారీ చిత్రాన్ని రూపొందించడానికి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'యమధీర' అనే టైటిల్ పెట్టడానికి ఎక్కువ అవకాశం వుందని ఫిలిం నగర్ టాక్. ఎన్టీఆర్ నటించిన 'యమదొంగ', చరణ్ నటించిన 'మగధీర' చిత్రాలలోని పదాలను కలిపి ఇలా కొత్త టైటిల్ తయారుచేసినట్టు చెబుతున్నారు.
*  అక్కినేని అఖిల్ తన రెండో సినిమా 'హలో' విడుదల సందర్భంగా ప్రమోషన్ కోసం అమెరికా వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగా వచ్చే నెల 15, 16, 17 తేదీల్లో న్యూజెర్సీ, డల్లాస్, శాన్ జోస్ నగరాలలో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.
*  సుమారు 26 సంవత్సరాల తర్వాత రజనీకాంత్, మమ్ముట్టి కలసి మళ్లీ ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇది ఒక మరాఠీ సినిమా కావడం విశేషం. దీపక్ భావే దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం షూటింగ్ ఫిబ్రవరిలో మొదలవుతుంది. మరో విశేషం ఏమిటంటే, జన్మతః మరాఠీ అయిన రజనీ నటిస్తున్న తొలి మరాఠీ చిత్రం ఇదే!
Anisha
NTR
Charan
Akhil
Rajani

More Telugu News