ఈ కాలంలో కూడా ఇటువంటి దారుణాలు జ‌రుగుతుండ‌డం బాధాక‌రం: స‌ంగీత ధ‌ర్నాపై కోదండ‌రామ్

22-11-2017 Wed 18:13 | National
  • భ‌ర్త‌పై సంగీత‌ ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోక‌పోవ‌డం అన్యాయం
  • ఆడ‌పిల్ల పుట్టింద‌ని ఇంట్లోంచి గెంటేయ‌డం విచార‌క‌రం
  • వ‌ర‌క‌ట్నం తీసుకురావాల‌ని ఈ కాలంలోనూ హింసించ‌డం ఏంటి?- కోదండ‌రామ్‌
  • అత్తామామ‌ల‌ను అరెస్టు చేయాల‌ని సంగీత చెప్పింది- ఎంపీ మ‌ల్లారెడ్డి
త‌న భ‌ర్త, టీఆర్ఎస్ బ‌హిష్కృత నేత శ్రీనివాస్‌రెడ్డి చేతిలో హింస‌కు గురైన సంగీత‌కు న్యాయం చేయాలని టీజేఏసీ త‌ర‌ఫున తాము డిమాండ్ చేస్తున్నామ‌ని ప్రొ.కోదండ‌రామ్ అన్నారు. ఈ రోజు హైద‌రాబాద్ శివారులోని బోడుప్ప‌ల్‌కు వ‌చ్చిన కోదండ‌రామ్ సంగీత‌తో మాట్లాడారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ... భ‌ర్త దాడి చేసిన‌ప్పుడు ఆయ‌న‌పై కేసులు పెట్ట‌డానికి చ‌ట్టాలు ఉన్నాయని, వాటి ప్ర‌కారం ద‌ర్యాప్తు చేయాలని అన్నారు. ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోక‌పోవ‌డం అన్యాయమ‌ని వ్యాఖ్యానించారు.

 శ్రీనివాస్‌రెడ్డి చ‌ట్టాన్ని ఉల్లంఘించాడని, సంగీత‌కు పోలీసులు న్యాయం చేయాలని కోరారు. ఆమె చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు ద‌ర్యాప్తు చేయాలని అన్నారు. ఈ కాలంలో కూడా ఆడ‌పిల్ల పుట్టింద‌ని ఇంట్లోంచి గెంటేయ‌డం, వ‌ర‌క‌ట్నం తీసుకురావాల‌ని హింసించ‌డం వంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటుండ‌డం బాధాక‌ర‌మ‌ని అన్నారు.

అంత‌కు ముందు మ‌ల్కాజిగిరి ఎంపీ మ‌ల్లారెడ్డి కూడా సంగీత వ‌ద్ద‌కు వ‌చ్చి ఆమెతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా మ‌ల్లారెడ్డి మాట్లాడుతూ... త‌ప్పు చేసిన వారు త‌మ‌ పార్టీకి చెందిన వారైనా వ‌దిలేది లేదని అన్నారు. సంగీత‌కు భ‌ద్ర‌త క‌ల్పిస్తామ‌ని అన్నారు. అత్తామామ‌ల‌ను అరెస్టు చేసేవ‌ర‌కు ధ‌ర్నా విర‌మించ‌బోన‌ని సంగీత చెప్పిందని అన్నారు.
KodandaramsangitaTRS

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more