Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పాట‌ల ద్వారా అత్య‌ధిక పారితోషికం పొందిన‌ మ‌హిళ‌ల జాబితా: 2017లో టాప్... బియోన్సే

  • జాబితా విడుద‌ల చేసిన ఫోర్బ్స్‌
  • ఈ ఏడాది 105 మిలియ‌న్ డాలర్లు సంపాదించిన పాప్ సింగ‌ర్‌
  • రెండో స్థానంలో అడెల్‌
సంగీతం వృత్తి ద్వారా అత్య‌ధిక పారితోషికం అందుకున్న మ‌హిళ‌ల జాబితాను ఫోర్బ్స్ మేగ‌జైన్ విడుదల చేసింది. ఇందులో పాప్ సింగ‌ర్ బియోన్సే మొద‌టి స్థానంలో నిలిచింది. జూన్ 1, 2016 - జూన్ 1, 2017 మ‌ధ్య బియోన్సే దాదాపు 105 మిలియ‌న్ డాల‌ర్లు సంపాదించిన‌ట్లు ఫోర్బ్స్ పేర్కొంది. ఈ కాలంలో ఆమె విడుద‌ల చేసిన 'లెమ‌నేడ్‌' సాంగ్ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందిన సంగ‌తి తెలిసిందే. ఆ పాట ద్వారా ఆమె పెద్ద మొత్తంలో వెన‌కేసుకున్న‌ట్లు తెలిపింది.

ఇక రెండో స్థానంలో అడెల్ నిలిచింది. ఈమె 69 మిలియ‌న్ డాల‌ర్లు సంపాదించింది. త‌ర్వాతి స్థానాల్లో టేల‌ర్ స్విఫ్ట్ (44 మిలియ‌న్‌), సెలీన్ డియోన్ (42 మిలియ‌న్‌), జెన్నిఫ‌ర్ లోపెజ్ (38 మిలియ‌న్‌), డాలీ పార్ట‌న్ (37 మిలియ‌న్‌), రిహానా (36 మిలియ‌న్‌), బ్రిట్నీ స్పియ‌ర్స్ (34 మిలియ‌న్‌), కేటీ పెర్రీ (33 మిలియ‌న్‌), బార్బ‌రా స్ట్రైసాండ్ (30 మిలియ‌న్‌)లు ఉన్నారు.
songs
music
paid
women
forbes
beyonce
adele
lemonade

More Telugu News