మరోసారి దౌర్జ‌న్యానికి పాల్ప‌డ్డ చైత‌న్య‌పురి కార్పొరేట‌ర్!

18-11-2017 Sat 19:28 | National
  • ఇటీవ‌లే ఓ ఇంటి యజమాని, కూలీల‌పై దౌర్జన్యానికి పాల్పడ్డ టీఆర్ఎస్ నేత‌
  • తాజాగా భాస్క‌ర్ రెడ్డి అనే వ్యాపారిపై దాడి
  • రూ.15 లక్షలు అప్పుగా తీసుకుని మ‌ళ్లీ ఇవ్వ‌ని విఠ‌ల్ రెడ్డి
  • స‌ద‌రు కార్పొరేటర్‌పై ఇప్ప‌టికే ప‌లు సెక్ష‌న్ల కింద కేసులు
టీఆర్ఎస్ నేత‌, జీహెచ్ఎంసీ చైతన్యపురి కార్పొరేటర్‌ జిన్నారం విఠల్ రెడ్డి ఇటీవ‌లే ఓ ఇంటి యజమాని, కూలీల‌పై దౌర్జన్యానికి పాల్పడిన విష‌యం తెలిసిందే. దీంతో ఇప్ప‌టికే ఆయ‌న‌పై పోలీసులు ప‌లు సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేశారు. ఇదిలా వుండగా, తాజాగా ఆయన మరో కేసులో ఇరుక్కున్నాడు.

వైన్ షాప్ టెండర్లకు సంబంధించి తెలంగాణ స‌ర్కారు ఇటీవల నిర్వహించిన లక్కీ డ్రాలో తన కొడుకు యశ్వంత్ రెడ్డి పేరు మీద మూసారాంబాగ్‌లో ఒక వైన్ షాప్‌ను దక్కించుకున్న విఠ‌ల్ రెడ్డి.. మరో లిక్కర్ వ్యాపారి విజయ్ భాస్కర్ రెడ్డితో కలిసి వ్యాపారం కొనసాగించడానికి మాట్లాడుకున్నాడు. ఈ క్ర‌మంలో అతని వద్ద నుంచి రూ.15 లక్షలు అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వ‌కపోవడమే కాకుండా, వ్యాపారంలో వాటా కూడా ఇవ్వలేదు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  

ఈ క్రమంలో తన కుమారులు, అనుచరులతో క‌లిసి సదరు కార్పొరేటర్ దౌర్జ‌న్యానికి పాల్ప‌డ్డాడు. అతని ఇంటిపై రెక్కీ నిర్వహించి, నిన్న రాత్రి విజయ్‌భాస్కర్ రెడ్డిపై దాడి చేయించాడు. డ‌బ్బుల్ని తిరిగి ఇవ్వాల‌ని కేసు పెడ‌తావా? అంటూ కొట్టారు. ఈ విషయాలన్నీ తన ఫిర్యాదులో పేర్కొని, విజయ్‌భాస్కర్ రెడ్డి పోలీసులను ఆశ్రయించాడు. విఠ‌ల్ రెడ్డి, అతని కుమారులతో త‌న‌కు ప్రాణభయం ఉందని భాస్క‌ర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.    
viral reddyTRScorporatoroutrage

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more