నేను కోమాలో నుంచి బయటికి రాగానే చిరంజీవి దంపతులనే చూశాను: శివాజీ రాజా

14-11-2017 Tue 17:29 | International
  • డ్రైవర్ కారును డివైడర్ కి గుద్దేశాడు 
  • నా జీవితంలో జరిగిన పెద్ద ప్రమాదం అది
  • 13 రోజుల పాటు కోమాలో వుండిపోయాను 
  • ఇండస్ట్రీ అంతా అండగా నిలిచింది
ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషిస్తూ వచ్చిన శివాజీరాజా, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, గతంలో తనకి జరిగిన కారు ప్రమాదం గురించి ప్రస్తావించారు. " నేను నా సొంత కారులో రామచంద్రాపురం నుంచి హైదరాబాద్ కి బయలుదేరాను .. మరుసటి రోజు వినాయక చవితి. తెల్లవారు జామున 5 గంటలకు మా డ్రైవర్ డివైడర్ ను గుద్దేశాడు" అని అన్నారు.

"మా అసిస్టెంట్ కి కాళ్లు విరిగాయి .. మా డ్రైవర్ రెండు కళ్లూ ఊడిపోయి పడిపోయాయి. నా ఎడమభాగం మొత్తం బాగా దెబ్బతినేసింది. ఆ సమయంలో ఇండస్ట్రీ అంతా నా వెనకే ఉంటూ వాళ్ల ఇంట్లో మనిషిలా నన్ను బతికించి తీసుకొచ్చింది. ఆ ప్రమాదం జరిగినప్పుడు 13 రోజుల పాటు కోమాలో వున్నాను. నన్ను చూడటానికి వచ్చిన చిరంజీవి గారు .. కోమాలో నుంచి బయటికి రాగానే తనకి కబురు చేయమని డాక్టర్స్ తో చెప్పారట. అలాగే నేను కోమాలో నుంచి బయటికి వచ్చి కళ్లు తెరవగానే, ఎదురుగా చిరంజీవి దంపతులు కనిపించారు .. అంతకన్నా ఏం కావాలి?" అంటూ చెప్పుకొచ్చారు.   
shivaji rajaChiranjeevi

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more