దక్షిణకొరియా వైపు వెళ్లబోయిన ఉత్తరకొరియా సైనికుడిపై తూటాల వర్షం కురిపించిన తోటి సైనికులు!

14-11-2017 Tue 13:24 | International
  • సరిహద్దులు దాటే ప్రయత్నం చేసిన చేసిన ఉత్తరకొరియా సైనికుడు
  • వెంటనే 40 రౌండ్లు కాల్పులు జరిపిన సాటి సైనికులు
  • తీవ్రంగా గాయపడిన సైనికుడ్ని ఆసుపత్రిలో చేర్చిన యునైటెడ్‌ నేషన్స్‌ కమాండ్‌ సిబ్బంది
ఉత్తరకొరియా నియంత నిర్ణయాన్ని ఏమాత్రం వ్యతిరేకించినా తీవ్రమైన శిక్షలు అమలవుతాయన్న సంగతి తెలిసిందే. ఆ దేశ సరిహద్దుల్లో చోటుచేసుకున్న ఘటన నియంత పాలనలో ఎంత క్రూరమైన శిక్షలు ఉంటాయో తెలిపేందుకు నిదర్శనంగా నిలిచింది. దాని వివరాల్లోకి వెళ్తే... ఉత్తరకొరియా సరిహద్దులోని పన్‌ మున్‌ జామ్‌ అనే గ్రామం అక్కడ ప్రముఖ పర్యాటక ప్రాంతం కావడంతో నిత్యం పర్యాటకుల రద్దీ ఉంటుంది. అయితే నిన్న పర్యాటకులు అక్కడికి పెద్దగా రాలేదు.

ఈ క్రమంలో అక్కడ గస్తీ నిర్వహించే ఆ దేశ సైనికుడు తన వాహనంలో దక్షిణకొరియా వైపు వెళ్లబోయాడు. దీనిని గమనించిన ఉత్తరకొరియా సైనికులు వెంటనే అతడిపై గుళ్ల వర్షం కురిపించారు. సుమారు 40 రౌండ్లకు పైగా తూటాలవర్షం కురిపించారు. దీంతో ఈ సరిహద్దు ప్రాంతంలో గస్తీ బాధ్యతలు నిర్వర్తించే యునైటెడ్‌ నేషన్స్‌ కమాండ్‌ (యూఎన్‌సీ) సిబ్బంది దీనిని గమనించి, హెలికాప్టర్‌ లో అతడిని ఆసుపత్రికి తరలించారు. అతడి శరీరంలోకి ఆరు బుల్లెట్లు దూసుకుపోవడంతో తీవ్రంగా గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. 
North Koreasouth koreabordersoldieramerica

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more