పోలీసులు బట్టలిప్పి కొట్టారు.. కేసీఆర్, చంద్రబాబు చంపెయ్యమన్నారన్నారు!: కలకలం రేపుతున్న యువకుడి సూసైడ్ సెల్ఫీ

14-11-2017 Tue 09:11 | Telangana
  • భార్యతో రాజీకి అత్తారింటికి వెళ్లిన రాజుపై దాడి చేసి పోలీసులకు అప్పగించిన బంధువులు
  • స్టేషన్ లో బట్టలిప్పి చితక్కొట్టిన ఎస్సై సైదాబాబు
  • ఎస్సై దురాగతాన్ని సెల్ఫీ వీడియోలో చెప్పి సూసైడ్ చేసుకున్న రాజు
నాగర్ కర్నూలు జిల్లాలో రాజు అనే యువకుడు పెట్టిన సెల్ఫీ సూసైడ్ నోట్ కలకలం రేపుతోంది. ఏడేళ్ల క్రితం రాజుకు అదే ప్రాంతానికి చెందిన యువతితో వివాహం జరిగింది. మనస్పర్థల నేపథ్యంలో యువతి పుట్టింటికి చేరింది. ఆమెతో చర్చల నేపథ్యంలో వారింటికి వెళ్లాడు రాజు. దీనిని అదనుగా చేసుకున్న ఆమె బంధువులు రాజుపై దాడి చేసి, పోలీసు కంప్లైంట్ చేశారు. దీంతో రాజును ఎస్సై సైదాబాబు, ఇతర పోలీసులు చితక్కొట్టారు.

తాను చేసిన తప్పేంటి? అని నిలదీయడంతో కేసీఆర్, చంద్రబాబు చంపేయమన్నారని, అందుకే కొడుతున్నామని ఎస్సై సమాధానం చెప్పాడని బాధితుడు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. తనను బట్టలిప్పించి గొడ్డును బాదినట్టు బాదారని కన్నీటిపర్యంతమయ్యాడు. ఆ దెబ్బలకు నడవలేకపోతున్నానని, తొడలు కమిలిపోయాయని, ఇదేం న్యాయమని అడిగాడు. పోలీసులు ఇలాగేనా వ్యవహరించేది? అని నిలదీశాడు. మహిళలు కూడా ఆలోచించాలని, వారిది కూడా తప్పు ఉంటుందని, తప్పంతా మగాళ్ల మీదే తోసేయడం సరికాదని హితవు పలికాడు.

అనంతరం పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. మగతగా ఉన్న రాజును చూసిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ రాజు ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం అతని అంత్యక్రియల సమయంలో అతని ఫోన్ లో ఈ సూసైడ్ వీడియో లభ్యమైంది. దీంతో ఎస్సై సైదాబాబును కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
sucidevideo sucide selfienagar karnool

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more