సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

14-11-2017 Tue 07:28 | Entertainment
  • హాకీ ప్లేయర్ పాత్రలో తాప్సీ 
  • ఫ్యాన్సీ రేటుకి 'జైసింహా' సీడెడ్ హక్కులు
  • నయనతార హిట్ సినిమాకి సీక్వెల్ 
  • వచ్చే నెలలో 'అజ్ఞాతవాసి' ఆడియో  
*  అందాల తాప్సీ హాకీ ప్లేయర్ గా నటిస్తోంది. మాజీ హాకీ ప్లేయర్ సందీప్ సింగ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న 'సూర్మ' అనే హిందీ చిత్రంలో తాప్సీ అతని ప్రేయసిగా హాకీ ప్లేయర్ పాత్రలో కనిపిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హర్యానాలోని షహబాద్ లో జరుగుతోంది.
*  నందమూరి బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'జైసింహా' చిత్రం షూటింగ్ నిరవధికంగా కొనసాగుతోంది. ఇదిలా ఉంచితే, ఈ చిత్రం సీడెడ్ హక్కులను సాయి కొర్రపాటి, ఎన్వీ ప్రసాద్ కలసి ఫ్యాన్సీ రేటుకి దక్కించుకున్నట్టు సమాచారం. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
*  నయనతార కలెక్టర్ గా నటించిన 'ఆరం' తమిళ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించడంతో దీనికి సీక్వెల్ చేసే ఆలోచన చేస్తున్నారు. ఈ విషయం గురించి చిత్ర దర్శకుడు గోపీ నైనార్ చెబుతూ, సీక్వెల్ తప్పకుండా చేస్తామని, త్వరలోనే ఆ పనులను మొదలుపెడతామని అన్నారు. కాగా, ఈ చిత్రాన్ని 'కర్తవ్యం' పేరిట తెలుగులో విడుదల చేస్తున్నారు.
*  పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న 'అజ్ఞాతవాసి' చిత్రం ఆడియోను వచ్చే నెల 14న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన పాటల చిత్రీకరణ బల్గేరియాలో జరుగుతోంది.     
TapseeBalakrishnaNayanataraPawan kalyan

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more