ప‌వ‌న్ క‌ల్యాణ్ దేవుడా?.. ఆయ‌న ఎంతటి దేవుడో నేనూ చూస్తా!: మ‌హేశ్ క‌త్తి స‌వాల్

13-11-2017 Mon 19:25 | Entertainment
  • ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని కొంద‌రు దేవుడని అంటున్నారు
  • జన‌సేనాని రిప్లై ఇస్తే నేను ఆయ‌న పార్టీలో చేరుతా
  • జ‌న‌సేనాని రాజ‌కీయాలను ప్ర‌క్షాళ‌న చేస్తాడ‌ని కొంద‌రు న‌మ్ముతున్నారు
  • ఫ్యాన్స్ తీరుపై ఆయ‌న స్పందిస్తే నేను కూడా ప‌వ‌న్‌ని న‌మ్ముతా
సినీన‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు త‌న అభిమానులు చేసే ఓవ‌ర్ యాక్ష‌న్ గురించి అన్నీ తెలుసని, ఆయ‌న‌ కావాల‌నే స్పందించ‌డం లేదని సినీవిశ్లేష‌కుడు మ‌హేశ్ క‌త్తి ఆగ్ర‌హం వ్యక్తం చేసిన విష‌యం తెలిసిందే. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని కొంద‌రు దేవుడని అంటున్నార‌ని, ఆయ‌న దేవుడా? అని మ‌హేశ్ క‌త్తి ప్ర‌శ్నించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక‌వేళ త‌న ఫ్యాన్సు చేష్ట‌ల‌పై స్పందిస్తే తాను ప‌వ‌న్‌కి దాసోహం అయిపోతాన‌ని వ్యాఖ్యానించారు.

జన‌సేనాని రిప్లై ఇస్తే తాను ఆయ‌న పార్టీలో చేరడానికి కూడా రెడీ అని మ‌హేశ్ క‌త్తి చెప్పారు. ప‌వ‌న్ కల్యాణ్ త‌న‌కు మ‌ద్ద‌తుగా స్పందించాల‌ని తాను అన‌డం లేద‌ని, ప‌వ‌న్ ఎలా స్పందించినా తన‌కు స‌రేన‌ని అన్నారు. త‌న ఫ్యాన్స్ ఇంతేన‌ని, మీ చావు మీరు చావండి అని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పినా త‌న‌కు ఓకేన‌ని వ్యాఖ్యానించారు. త‌న‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పంద‌న మాత్ర‌మే కావాల‌ని, 'ఆయ‌న నెగిటివ్‌గా స్పందిస్తాడా? పాజిటివ్‌గా స్పందిస్తాడా?' అన్న విష‌యం త‌న‌కు అన‌వ‌స‌ర‌మ‌ని మ‌హేశ్ క‌త్తి అన్నారు.
 
అభిమానులు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని దేవుడు అని అంటున్నార‌ని, ఆయ‌న ఎంత‌టి దేవుడో తానూ చూస్తాన‌ని మ‌హేశ్ క‌త్తి స‌వాల్ విసిరారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ రాజ‌కీయాలను ప్ర‌క్షాళ‌న చేస్తాడ‌ని కొంద‌రు న‌మ్ముతున్నార‌ని, ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న‌ అభిమానుల తీరుపై స్పందిస్తే తాను కూడా ప‌వ‌న్‌ని న‌మ్ముతాన‌ని, ఆయ‌న పార్టీ కోసం ప‌నిచేస్తాన‌ని అన్నారు. 
Pawan Kalyanmahesh kathifans

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more