బాల్య మిత్రులు సచిన్, కాంబ్లీ కలిసిపోయారోచ్!

11-11-2017 Sat 09:58 | Sports
  • విభేదాలు మరిచి, కలసిపోయిన సచిన్, కాంబ్లీ
  • ఫొటోనే షేర్ చేసిన సచిన్
  • క్రికెట్ తనకు మంచి స్నేహితులను ఇచ్చిందంటూ కామెంట్
భారత మాజీ స్టార్ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీలు బాల్యమిత్రులు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే, కాలక్రమంలో వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తి, ఇద్దరూ దూరమయ్యారు. తాజాగా, వీరిద్దరూ మళ్లీ కలిసిపోయారు. తన చిన్ననాటి మిత్రుడు సచిన్ తో తొలి సెల్ఫీ అంటూ గత నెలలో సోషల్ మీడియాలో కాంబ్లీ క్లారిటీ ఇచ్చాడు. తాజాగా, సచిన్ కూడా 'ఫ్రెండ్స్ ఫర్ లైఫ్' అంటూ తన మిత్రులతో దిగిన ఫొటోను ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.

ప్రముఖ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్ రాసిన పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమానికి సచిన్, కాంబ్లీ, అతుల్ కస్బేకర్, అజిత్ అగార్కర్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరంతా ఓ ఫొటో దిగారు. ఈ ఫొటోను షేర్ చేసిన సచిన్... 'క్రికెట్ నాకు ఇచ్చిన అత్యద్భుతమైన విషయాల్లో... జీవితాంతం తోడుండే మిత్రులను కూడా ఇవ్వడం ఒకటి' అంటూ కామెంట్ పెట్టాడు.

సచిన్, కాంబ్లీల మధ్య వివాదం విషయానికి వస్తే... తన కెరీర్ పతనం అవుతున్నప్పుడు వ్యక్తిగతంగా కానీ, ప్రొఫెషన్ పరంగా కానీ సచిన్ తనకు అండగా నిలవలేదని గతంలో కాంబ్లీ ఆవేదన వ్యక్తం చేశాడు. తన బాధను తెలియజేస్తూ ఓ టీవీ షోలో కన్నీటిపర్యంతమయ్యాడు. ఈ విషయం క్రికెట్ ప్రేమికుల్లో కలవరం రేపింది. ఇది జరిగి ఎనిమిదేళ్లు గడిచింది.

మరోవైపు, కాంబ్లీ వ్యాఖ్యలపై సచిన్ స్పందించలేదు. కాంబ్లీ అనారోగ్యానికి గురై, ఆసుపత్రిలో ఉన్న సమయంలో కూడా అతన్ని పరామర్శించడానికి సచిన్ వెళ్లలేదు. దీనికి తోడు సచిన్ వీడ్కోలు కార్యక్రమానికి కూడా కాంబ్లీకి ఆహ్వానం అందలేదు. తాజాగా వీరిద్దరూ మళ్లీ కలసిపోవడం పట్ల క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 
Sachin Tendulkarvinod kambliajith agarkarteam india

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more