విరాట్ తో కలిసి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాలని ఉంది!: ఐర్లాండ్ రెజ్లర్ ఆసక్తికర ప్రకటన

  • కోహ్లీకి కొత్త అభిమాని 'డబ్ల్యూడబ్ల్యూఈ' రెజ్లర్ ఫిన్ బలోర్
  • కోహ్లీతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాలని ఉంది
  • తను ఓకే అంటే రెండు రౌండ్లు రెజ్లింగ్ కూడా.. అంటున్న రెజ్లర్ 
 క్రికెట్ అంటే పెద్దగా తెలియని వారు కూడా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఫ్యాన్స్ అయిపోతున్నారు. అలాంటి వారిలో ఐర్లాండ్ రెజ్లర్ ఫిన్ బలోర్ కూడా చేరాడు. విరాట్ తో కలిసి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాలని ఉందని తాజాగా ఈ రెజ్లర్ ఆసక్తిని వ్యక్తం చేశాడు. త్వరలోనే విరాట్ ను కలుస్తానని, ఆ సందర్భంగా అతనితో ఒక ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతానని అన్నాడు. విరాట్ ఓకే అంటే కనుక అతనితో రెండు రౌండ్లు రెజ్లింగ్ కూడా ఆడతానని నవ్వుతూ చెప్పాడు. ఆ తరువాత పనిలో పనిగా క్రికెట్ లో మెళకువలు తెలుసుకుంటానని చెప్పాడు.

అయితే, తనకు క్రికెట్ గురించి పెద్దగా తెలియదని, ఒకసారి ఐర్లాండ్-ఆస్ట్రేలియా దేశాల మధ్య జరిగిన ఒక మ్యాచ్ ను చూశానని చెప్పాడు. దీంతో ఆ ఆటకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలని అనిపించిందని అన్నాడు. భారత్-ఐర్లాండ్ దేశాల మధ్య ఒక క్రికెట్ మ్యాచ్ జరిగితే అది తనకు ఎంతో గర్వకారణమని ఫిన్ బలోర్ తెలిపాడు.

కాగా, ఫిన్ బలోర్ డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్. ఈ ఆటకు యువతలో విశేషమైన ఆసక్తి వ్యక్తమవుతుంది. ఈ ఏడాది చివర్లో భారత్ లో డబ్ల్యూడబ్ల్యూఈ టోర్నీ జరగనుంది. దీనికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు.  
Go Back to Shorts
wwe
wrestling
wrestler
fin balore

More Telugu News