ఆర్బీఐ మాజీ గవర్నర్ కు రాజ్యసభ సీటు?
- రాజన్ ను రాజ్యసభకు పంపాలనుకుంటున్న కేజ్రీవాల్
- ఆప్ కు మూడు రాజ్యసభ సీట్లు
- జనవరి నుంచి ప్రారంభం కానున్న పదవీకాలం
ఆర్బీఐ గవర్నర్ గా పదవీకాలం ముగిసిన అనంతరం షికాగో యూనివర్శిటీలో ప్రొఫెసర్ గా రాజన్ పని చేస్తున్నారు. తన పదవిని రెండోసారి పొడిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడంతో... తనకు ఎంతో ఇష్టమైన అధ్యాపక వృత్తిని రాజన్ ఎంచుకున్నారు. ఇక ఈ మూడు రాజ్యసభ సీట్ల కోసం ఆప్ లో పోటీ తీవ్రంగానే ఉంది. ఆప్ కీలక నేత కుమార్ విశ్వాస్ కూడా ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు.