త్రివిక్రమ్ తరువాత 'శతమానం భవతి' దర్శకుడితో ఎన్టీఆర్!
Add ap7am to your home Screen

త్రివిక్రమ్ తరువాత 'శతమానం భవతి' దర్శకుడితో ఎన్టీఆర్!

  • ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ తో 
  • ఆ తరువాత సినిమా సతీశ్ వేగేశ్నతో 
  • 'శతమానం భవతి'తో సతీశ్ వేగేశ్నకి గుర్తింపు
  • ఈ సినిమాకి కూడా నిర్మాత దిల్ రాజు
'జనతా గ్యారేజ్' .. ' జై లవ కుశ' వంటి మాస్ సినిమాలు చేసిన ఎన్టీఆర్, తన తదుపరి సినిమాను త్రివిక్రమ్ తో చేయనున్నాడు. ఈ సారి ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కథతో రానున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ఇంకా రెండు నెలల సమయం వుంది. దాంతో ఈ సినిమాకి అవసరమైన లుక్ ను ట్రై చేస్తూ .. ఆ తరువాత సినిమాను కూడా లైన్లో పెట్టే పనిలో ఎన్టీఆర్ వున్నాడని టాక్.

 త్రివిక్రమ్ తరువాత ఎన్టీఆర్ 'సతీశ్ వేగేశ్న' దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. 'శతమానం భవతి' తో హిట్ కొట్టిన ఆయన, ఇటీవలే ఎన్టీఆర్ కి ఓ కథ వినిపించడం .. ఆయన మార్పులు సూచించడం జరిగిందట. దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమాకి 'శ్రీనివాస కల్యాణం' అనే టైటిల్ ను కూడా ఖరారు చేసుకున్నారు. ఇది కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరగా వెళ్లే కథ కావడం వల్లనే ఎన్టీఆర్ ఓకే చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ కి తగినట్టుగా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట.
ntr

More Telugu News