కోహ్లీ సెంచరీ బాదిన వేళ.. మైదానంలోకి దూసుకొచ్చిన అభిమాని.. బయటపడిన భద్రతా లోపాలు!
- కోహ్లీని అభినందించేందుకు మైదానంలోకి చొచ్చుకొచ్చిన అభిమాని
- అడ్డుకున్న అంపైర్.. ఆటకు అంతరాయం
- నిర్బంధించి పోలీసులకు అప్పగింత
ఆ వెంటనే స్క్వేర్-లెగ్ వద్ద ఉన్న అంపైర్ అతడిని అడ్డుకున్నాడు. ఈ క్రమంలో ఆటకు కొంతసేపు అంతరాయం కలిగింది. అభిమానిని అదుపులోకి తీసుకుని స్టేడియం భద్రతా సిబ్బంది అతడిని స్థానిక పోలీసులకు అప్పగించారు. అనంతరం ఆట తిరిగి ప్రారంభమైంది. గతంలో ఇదే మైదానంలో ఇటువంటి ఘటనే జరిగింది. ఐపీఎల్లో భాగంగా గుజరాత్-ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్నప్పుడు కూడా ఇలాగే అభిమాని ఒకరు గ్రౌండ్లోకి చొచ్చుకొచ్చాడు.