భార్యకు అక్రమ సంబంధం అంటగట్టి.. కొట్టి, బయటకు గెంటేసిన యూపీ బీజేపీ నేత.. వీడియో సాక్ష్యాధారాలతో భార్య ఫిర్యాదు!
- నుపుర్ శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్న వినయ్ శర్మ
- అక్రమ సంబంధం ఆరోపణలు చేస్తూ తాగి హింస
- అనుచరులతో వచ్చి బట్టలు చించి మరీ కొట్టాడంటూ సాక్ష్యాధారాలతో కేసు
దీంతో నుపుర్ కు అక్రమ సంబంధం ఉందని ఆరోపిస్తూ, వినయ్ శర్మ రోజూ పీకల్దాకా మద్యం తాగి ఇంటికి రావడం, ఆమెను చితక్కొట్టడం చేస్తున్నాడు. తాజాగా తన పదిమంది అనుచరులతో పాటు వచ్చి, ఆమె దుస్తులు చించి మరీ కొట్టి, కొడుకుని తీసుకుని వెళ్లిపోయాడు. దీంతో అవమానంగా భావించిన ఆమె సాక్ష్యాధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వినయ్ శర్మపై పోలీసులు ఐపీసీ 323, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం తన భార్య బంగారు నగలు, నగదును ఎత్తుకెళ్లడమే కాకుండా, తనను చంపుతానని బెదిరిస్తోందంటూ వినయ్ శర్మ ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ రెండు కేసులపై దర్యాప్తు ప్రారంభించారు.