'ఓయ్ తమ్ముడూ..' అంటూ హీరో విజయ్‌ని పిలిచిన సమంత... 'అదిరింది' ట్రైలర్ విడుదల
- వివాదాలు తొలగిపోవడంతో తెలుగులో `మెర్సల్`
- రేపు తెలుగులో విడుదల కానున్న `అదిరింది` చిత్రం
- దర్శకత్వం వహించిన అట్లీ
‘కళ్లు లేకుండా బతకొచ్చు. కానీ పిల్ల లేకుండా ఎవ్వరూ బతకలేరు’, `తల్లి బిడ్డను కనడానికి పది నెలలు పట్టుద్ది. ఒకరు డిగ్రీ అందుకోవడానికి మూడేళ్లు పట్టుద్ది. కానీ ఒక నాయకుడు ఉదయించడానికి ఒక యుగమే పట్టుద్ది’ అనే డైలాగులను ట్రైలర్‌లో చూడొచ్చు. ఇక ఇందులో విజయ్ త్రిపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. ముగ్గురు హీరోయిన్లైన కాజల్, నిత్యామీనన్, సమంతలను కూడా ఈ ట్రైలర్‌లో చూడొచ్చు.