దాస్నా జైలు దంత వైద్య‌శాలకు ఆరుషి తల్వార్ పేరు... యోచిస్తున్న యూపీ ప్ర‌భుత్వం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దాస్నా జైలు దంత వైద్య‌శాలకు ఆరుషి తల్వార్ పేరు... యోచిస్తున్న యూపీ ప్ర‌భుత్వం

  • దంత వైద్య‌శాల‌ను అభివృద్ధి చేసిన త‌ల్వార్ దంప‌తులు
  • నాలుగేళ్లు ఖైదీలు, పోలీసుల‌కు సేవ‌లు
  • జైళ్ల‌ మంత్రిని కోరిన త‌ల్వార్ దంప‌తులు
కూతురు ఆరుషి, ప‌నిమ‌నిషి హేమ‌రాజ్ హ‌త్య కేసులో నాలుగేళ్లపాటు జైలు శిక్ష అనుభవించిన త‌ల్వార్ దంప‌తుల కోరిక మేర‌కు వారు శిక్ష అనుభ‌వించిన దాస్నా జైలులోని దంత వైద్య‌శాల‌కు ఆరుషి త‌ల్వార్ పేరు పెట్టాల‌ని ఉత్త‌ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం యోచిస్తోంది. అల‌హాబాద్ హైకోర్టు తీర్పు మేర‌కు ఇటీవ‌ల విడుద‌లైన త‌ల్వార్ దంప‌తులు, తాము జైలు జీవితం గడిపిన సమయంలో ఈ ఆసుప‌త్రిని అభివృద్ధి చేశారు.

నాలుగేళ్ల శిక్షాకాలంలో వారు ఎంతోమంది ఖైదీలు, జైలు అధికారులు, పోలీసుల‌కు ఆరోగ్య సేవ‌లు అందించారు. దంత వైద్య‌శాల‌కు త‌మ కూతురి పేరు పెట్టాల‌ని త‌ల్వార్ దంప‌తులు ఉత్త‌ర ప్ర‌దేశ్ జైళ్ల మంత్రి జై కుమార్ సింగ్ జాకీకి విన్నవించుకున్నారు. వారి విన్న‌పాన్ని ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుని వైద్య‌శాల‌కు ఆరుషి పేరు పెట్టేందుకు యోచిస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు. దీనికి సంబంధించి ఒకసారి త‌ల్వార్ దంప‌తులతో మాట్లాడి, ముందుకు వెళతామని మంత్రి పేర్కొన్నారు.
aarushi talwar
hemaraj
nupur talwar
rajesh talwar
uttar pradesh

More Telugu News