ఒకప్పుడు గౌరవ్గా అలరించాడు... ఇప్పుడు గౌరీగా పాల్గొనబోతున్నాడు!
- లింగ‌మార్పిడి శ‌స్త్ర‌చికిత్స త‌ర్వాత మ‌ళ్లీ టీవీ తెర మీద‌కి గౌరీ అరోరా
- `స్ప్లిట్స్‌విల్లా` కార్య‌క్ర‌మంలో పాల్గొన్న గౌర‌వ్‌
- `ఇండియాస్ నెక్స్ట్ టాప్ మోడ‌ల్‌` కార్య‌క్ర‌మానికి గౌరీ
`స్ప్లిట్స్విల్లా సీజన్ 8` కంటెస్టంట్ గౌరవ్ అరోరా గుర్తున్నాడు కదా! చక్కని దేహదారుఢ్యంతో అమ్మాయిల మనసు దోచేసిన గౌరవ్, ఆ కార్యక్రమం తర్వాత లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకుని గౌరీ అరోరాగా మారాడు. ఇప్పుడు గౌరీ అరోరా పేరుతోనే `ఇండియాస్ నెక్స్ట్ టాప్ మోడల్` కార్యక్రమంలో పాల్గొని ర్యాంప్ పై హొయలు ఒలికించనున్నాడు.
తాను ఇలా కొత్త అవతారంలో బుల్లితెర మీద మళ్లీ కనిపించడం వల్ల బయటికి అబ్బాయిగా, లోపల అమ్మాయిగా జీవిస్తున్నవారందరికీ ఆదర్శంగా మారి, వారు ధైర్యంగా ముందుకు రాగల అవకాశం కలుగుతుందని గౌరీ పేర్కొంది. `స్ప్లిట్స్విల్లా` సమయంలోనే తనకు అమ్మాయిగా మారాలన్న కోరిక కలిగిందని గౌరీ తెలిపింది.