చంద్రబాబు కామెంట్లకు రామ్ గోపాల్ వర్మ సమాధానం!
- చరిత్రను వక్రీకరిస్తే ప్రజలు హర్షించరన్న సీఎం వ్యాఖ్యలు ముమ్మాటికీ నిజం
- ఎన్టీఆర్ చరిత్ర తెరిచిన పుస్తకమే
- ఆ పుస్తకంలో చిరిగిపోయిన లేదా చించబడ్డ పేజీలను అతికించబోతున్నా
'లక్ష్మీస్ ఎన్టీఆర్' పై చంద్రబాబు నాయుడి గారి కామెంట్లపై నా కామెంట్లు...
ఈ సినిమాలో నిజాలను వక్రీకరిస్తే ప్రజలు హర్షించరు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ నిజం. అందుకే జరిగిన నిజాలను ఏమాత్రం వక్రీకరించకుండా, సినిమా తీయబోతున్నాను.
చంద్రబాబు గారు అన్నట్టు ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్తకమే. ఆ పుస్తకంలో చిరిగిపోయిన లేదా చింపబడ్డ చాలా పేజీలను ఈ సినిమా ద్వారా తిరిగి అతికించబోతున్నాను.