బాలయ్య సరసన 'పిల్ల జమీందార్' హీరోయిన్!
- షూటింగ్ దశలో బాలకృష్ణ మూవీ
- కథానాయికలుగా నయనతార .. నటాషా దోషి
- మరో హీరోయిన్ కోసం జరుగుతోన్న అన్వేషణకు ఫుల్ స్టాప్
గతంలో నాని హీరోగా వచ్చిన 'పిల్ల జమీందార్' సినిమాలో హరిప్రియ కథానాయికగా నటించింది. ఆ సినిమా హిట్ కొట్టినా ఆమె కెరియర్లో పెద్దగా మార్పులేం జరగలేదు. దాంతో ఈ అమ్మాయి కన్నడ సినిమాలపై దృష్టి పెట్టి .. అక్కడ నెట్టుకొస్తోంది. అలాంటి హరిప్రియను బాలకృష్ణ తాజా చిత్రం కోసం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఈ సినిమా యూనిట్ కూడా ధ్రువీకరించింది. మరి ఈ సినిమా అయినా ఈ సుందరికి కలిసొస్తుందేమో చూడాలి.