టెస్టుల్లో అరంగేట్రానికి సిద్ధమైన ఐర్లాండ్.. పాక్‌తో తొలిపోరు!

  • వచ్చే ఏడాది మేలో తలపడనున్న రెండు జట్లు
  • ఈ ఏడాది మొదట్లోనే ఆఫ్ఘనిస్థాన్, ఐర్లండ్‌లకు టెస్ట్ హోదా
  • 12కు పెరిగిన టెస్ట్ దేశాల సంఖ్య
క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుకుంటున్న ఐరోపా తొలి టెస్ట్ ఆడేందుకు రంగం సిద్ధమైంది. వచ్చే ఏడాది మేలో పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మేరకు ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ప్రకటించాయి. ఈ ఏడాది జూన్‌లో ఐర్లాండ్, ఆఫ్ఘనిస్థాన్‌లు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)లో పూర్తి స్థాయి సభ్య దేశాలుగా మారాయి. ఫలితంగా ఈ రెండు దేశాలకు టెస్ట్ హోదా లభించింది.


ఆఫ్ఘనిస్థాన్, ఐర్లాండ్‌ల చేరికతో టెస్ట్ దేశాల సంఖ్య 12కు చేరుకుంది. గతవారం ఆక్లాండ్‌లో జరిగిన ఐసీసీ సమావేశంలో పాకిస్థాన్, ఐర్లాండ్ క్రికెట్ బోర్డుల మధ్య ఒప్పందం జరిగింది. వచ్చే ఏడాది జరగనున్న టెస్ట్ మ్యాచ్‌ కోసం పాకిస్థాన్, ఐర్లాండ్‌లకు స్వాగతం పలికేందుకు సంతోషిస్తున్నామని సీఈవో వారెన్ డ్యూట్రమ్ పేర్కొన్నారు. కాగా, ఇరు దేశాల మధ్య జరగనున్న మ్యాచ్‌కు సంబంధించిన షెడ్యూల్, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.
Go Back to Shorts
Ireland
Test match
Pakistan
ICC

More Telugu News