నా బెస్ట్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకున్నా: సమంత
- ఇప్పుడు నేను అక్కినేని స‌మంత
- అక్కినేని వారి కోడ‌లిని అయ్యా
- ‌అక్కినేని కుటుంబంలో ఆడ‌వారికి ఎంతో ప్రాధాన్య‌త ఉంటుంది
- అమ‌ల ఎంతో ఇండిపెండెంట్‌గా ఉంటారు
తాను ఇప్పుడు అక్కినేని సమంత అని, అక్కినేని వారి కోడలిని అయ్యానని సమంత వ్యాఖ్యానించింది. ‘రాజుగారి గది-2’ సినిమా రేపు విడుదల కానున్న నేపథ్యంలో ఈ రోజు హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సమంత మాట్లాడుతూ.. అక్కినేని కుటుంబంలో ఆడవారికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారని, అమల ఎంతో ఇండిపెండెంట్గా ఉంటారని చెప్పింది. అక్కినేని అనేది పవర్ ఫుల్ నేమ్ అని వ్యాఖ్యానించింది. తాను తన బెస్ట్ ఫ్రెండ్ నాగచైతన్యని పెళ్లి చేసుకున్నానని పేర్కొంది. అక్కినేని కుటుంబంలో బాధ్యతగా ఉంటానని తెలిపింది. ‘రాజుగారి గది-2’ సినిమా చేసేటప్పుడు సమయం సరదాగా గడిచిపోయిందని చెప్పింది.