రేపు మామాకోడ‌ళ్ల విశ్వ‌రూపం చూడ‌బోతున్నారు: సమంత, నాగార్జున గురించి ద‌ర్శ‌కుడు ఓంకార్‌

12-10-2017 Thu 16:55 | Entertainment
  • స‌మంత కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెస్ రేపు చూస్తారు 
  • ఈ విషయాన్ని రేపు అంద‌రూ చెబుతారు
  • టెక్నీషియ‌న్స్ ఎంత‌గానో స‌పోర్ట్ చేశారు.. నాగార్జునకి రుణపడి ఉంటా
  • యాంకరింగ్ స్టార్ట్ చేసేటప్పుడే దర్శకుడిని కావాలనుకున్నా
రేపు మామాకోడ‌ళ్ల విశ్వ‌రూపం చూడ‌బోతున్నారని ద‌ర్శ‌కుడు ఓంకార్ అన్నారు. నాగార్జున, స‌మంత‌ న‌టించిన రాజుగారి గ‌ది-2 సినిమా రేపు విడుద‌ల కాబోతున్న నేప‌థ్యంలో ఈ రోజు హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఓంకార్ మాట్లాడుతూ... స‌మంత‌ కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెస్ రేపు చూస్తారని అన్నారు. ఇది తాను చెప్ప‌డం కాద‌ని, రేపు అంద‌రూ చెబుతార‌ని అన్నారు. చిత్ర నిర్మాణంలో టెక్నీషియ‌న్స్ ఎంత‌గానో స‌పోర్ట్ చేశారని అన్నారు.

పెద్ద హీరోతో సినిమా తీస్తున్నాన‌న్న భ‌యం త‌న‌లో లేకుండా నాగార్జున చేశార‌ని అన్నారు. యాంకరింగ్ స్టార్ట్ చేసేటప్పుడే తాను దర్శకుడిని కావాలనుకున్నాన‌ని అన్నారు. త‌న‌ మూడో మూవీకే నాగార్జునతో సినిమా తీసే అవ‌కాశం వ‌చ్చింద‌ని అన్నారు. రామ్ గోపాల్ వ‌ర్మ నుంచి ఓంకార్ వ‌ర‌కు నాగార్జున ఎంత‌మందికో ఇటువంటి అవ‌కాశాలు ఇచ్చార‌ని అన్నారు.

రాజుగారి గ‌ది లాంటి చిన్న సినిమా చేసిన త‌న‌కు అవకాశం ఇచ్చారని, ఆయ‌న‌కు రుణ‌ప‌డి ఉంటానని అన్నారు. స‌మంతకి కూడా తాను రుణ‌ప‌డి ఉంటానని చెప్పారు. పెద్ద ద‌ర్శ‌కుల‌తో చేసిన స‌మంత  త‌న సినిమాలో న‌టించ‌డం త‌న‌ అదృష్ట‌మ‌ని అన్నారు. రేపటి రోజు కోసం తాను ఎంత‌గానో ఎదురు చూస్తున్నానని చెప్పారు. ఈ సినిమాలో ఎంత ఎమోష‌న్ ఉంటుందో రేపు చూస్తారని అన్నారు.

వెన్నెల కిశోర్‌, ప్రవీణ్‌, అశ్విన్‌, ష‌క‌ల‌క శంక‌ర్ కామెడీని ఇర‌గ‌దీశార‌ని అన్నారు. కామెడీతో పాటు ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ గా సినిమా ఉంటుందని చెప్పారు. త‌న‌ను న‌మ్మి నాగార్జున‌, స‌మంత ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారని ఓంకార్ చెప్పారు.  
ఓంకార్

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more