మీ కోసం దీపికా పదుకునే నుంచి కూలీ పనులు చేసే స్త్రీల వరకూ అడిగి చూశా..!: సోమిరెడ్డిపై వర్మ వరుస సెటైర్లు

12-10-2017 Thu 09:14 | Both States
  • సోమిరెడ్డి ఒక్కో ఆరోపణకూ సమాధానం ఇచ్చిన వర్మ
  • పొద్దునే ఫేస్ బుక్ ఖాతాలో ఓ పెద్ద పోస్టు
  • మై రిప్లైస్ అంటూ సోమిరెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు
నిన్నంతా ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మధ్య 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంపై తీవ్ర వాదోపవాదాలు జరిగిన సంగతి తెలిసిందే. తిరిగి ఈ ఉదయం 8.15 గంటల సమయంలో రామ్ గోపాల్ వర్మ తన ఫేస్ బుక్ ఖాతాలో ఇదే విషయంపై స్పందించాడు.

 "మై రిప్లైస్ టు ది గ్రేట్ ఆనరబుల్ టీడీపీ అగ్రికల్చర్ మినిస్టర్ 'మర్యాద తిమ్మన్న' సోమిరెడ్డి గారి కామెంట్స్ కు" అంటూ వ్యంగ్యాస్త్రాలు విడిచారు. సోమిరెడ్డి వ్యాఖ్యలను ఒక్కొక్కటిగా ప్రస్తావిస్తూ, వాటికి తన సమాధానాలు చెప్పాడు.

"ఎన్టీఆర్ జీవిత చరిత్ర సినిమాలో నన్ను హీరోగా చేయమని రాంగోపాల్ వర్మ అడగడం సంతోషం. నేను హీరోగా చేయాలంటే హీరోయిన్ గా లక్ష్మీ పార్వతిని మార్చాలి" అన్న సోమిరెడ్డి వ్యాఖ్యకు, "సార్ మీరు హీరోయిన్ గా లక్ష్మి పార్వతి గారిని వద్దు అని చెప్పినప్పట్నుంచి దీపికా పదుకొనే నుండి మీ అగ్రికల్చర్ పొలాలలో పని చేసే స్త్రీ కూలీలదాకా అందర్నీ అడిగి చూసా. వాళ్ళ రిప్లైలు వింటే మీరు ఉరేసుకుంటారు. కాబట్టి మానవతా దృక్పధం కన్నా మీ భార్య గారి మీద గౌరవంతో వాళ్ళు మీ పైన వ్యక్తపరిచిన అభిప్రాయాలు అన్నింటిని నా మనసులోనే అతి భద్రంగా దాచిపెడ్తున్నా" అన్నాడు.

ఇక "లక్ష్మి పార్వతి గారంటే నాకు చాలా గౌరవం ఉంది . అందుకే ఆమె హీరోయిన్ గా వద్దు అంటున్నా" అని సోమిరెడ్డి అన్నందుకు, "అంటే హీరోయిన్లు గౌరవానికి అనర్హులనా? మినిస్టర్ గారూ... హీరోయిన్లపై మీ ఈ ఇన్సల్టింగ్ కామెంట్ పైన దీపికా పదుకొనె, సమంత, కత్రినా కైఫ్, ఇలియానా, ప్రియాంక చోప్రా వగైరా హీరోయిన్ల రియాక్షన్లను మీడియా వెంటనే తీసుకోకపోతే వాళ్ళు కూడా మీ అంత అతి......... దీని అర్థం చెప్పను. ఎందుకులే, ఎంత చెడ్డా మీరు మినిస్టర్ గా!" అన్నాడు.

"ఎన్టీఆర్ గురించి నాకు తెలిసినంతగా రామ్ గోపాల్ వర్మకు తెలియదు" అన్న సోమిరెడ్డి వ్యాఖ్యలపై "మై డియర్ సోమి, ఇక్కడ ప్రశ్న నాకెంత తెలుసని కాదు. తెలిసేంత బుర్ర నీకు ఉందా అని" అని సెటైర్ వేశాడు. రాజకీయ ఉద్దేశాలతోనే ఈ సినిమాను ఎన్నికల ముందు తీస్తున్నారని సోమిరెడ్డి ఆరోపించినందుకు, రాజకీయ ఉద్దేశాలు ఏమి లేకుండానే రాజకీయ నాయకుడివి అయ్యావా? అయితే నీ 'ఎన్'కి ఓ నమస్కారం. ఎన్- అంటే తప్పనుకోవద్దు. ఎన్ అంటే నోరు అన్నాడు ఆర్జీవీ.
ram gopal varmalakshmi's ntrsomireddy

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more