శిక్షణ కోసం 3 లక్షల మంది ఉద్యోగార్థులను జపాన్ పంపిస్తున్న భారత్
- ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం
- వారి ఖర్చును భరించనున్న జపాన్ ప్రభుత్వం
- 50 వేల మందికి అక్కడే ఉద్యోగాలు
అక్టోబరు 16 నుంచి మూడు రోజులపాటు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ టోక్యోలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఎంఓసీపై సంతకాలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. శిక్షణ కోసం జపాన్ వెళ్లే వారు 3-5 ఏళ్ల కాలం ఉంటారని, వీరంతా జపాన్ ఈకో సిస్టంలో పనిచేస్తారని మంత్రి తెలిపారు. అలాగే ఉద్యోగావకాశాలు కూడా పొందుతారని వివరించారు. శిక్షణ కోసం వెళ్లే వారిలో 50 వేల మందికి అక్కడ ఉద్యోగాలు దొరికే అవకాశం ఉందని పేర్కొన్నారు. శిక్షణ అనంతరం భారత్ చేరుకునే వారు ఇక్కడి పరిశ్రమల్లో ఉద్యోగాల్లో చేరుతారని తెలిపారు.