అల్లరి పిల్లాడికి 'కటింగ్' ఇలాగే ఇవ్వాలి మరి... నేలపై పడుకుని హెయిర్ కటింగ్ చేసిన బార్బర్!

11-10-2017 Wed 20:53 | Offbeat
  • తన పనిపై ఎంతో నిబ‌ద్ధ‌త ఉన్న బార్బ‌ర్
  • అల్లరి పిల్లాడితో పాటు నేలపై పడుకుని హెయిర్ కటింగ్ చేసిన వైనం
  • కటింగ్ చేస్తుండగా తీసిన ఫొటోకి అనూహ్య స్పందన
తన పనిపై ఎంతో నిబ‌ద్ధ‌త ఉన్న కెనడాకు చెందిన ఓ బార్బ‌ర్ చేసిన ప‌ని ప్ర‌పంచ వ్యాప్తంగా అంద‌రినీ క‌ట్టిప‌డేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటో ఒక‌టి విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది. అందులో ఓ అల్ల‌రి పిల్లాడికి స‌ద‌రు బార్బ‌ర్ క‌టింగ్ చేసేందుకు నేల‌పై ప‌డుకోవాల్సి వ‌చ్చింది. పూర్తి వివ‌రాల్లోకి వెళితే జ‌కాంబ్ అనే బార్బర్ వ‌ద్ద‌కు ఓ మ‌హిళ త‌న కుమారుడిని తీసుకొని వ‌చ్చి హెయిర్ క‌టింగ్ చేయ‌మ‌ని కోరింది.

ఆ ఆరేళ్ల‌ పిల్లాడికి వినికిడి శ‌క్తిలేదు. అలాగే మాట్లాడ‌లేడు కూడా. ప్ర‌తిసారి ఆ మ‌హిళ త‌న కుమారుడిని ఆ బార్బ‌ర్ వ‌ద్ద‌కే తీసుకెళ్తుంది. ఆ బాలుడు ఎవ‌రి మాటా వినిపించుకోకుండా విప‌రీతంగా అల్ల‌రి చేస్తూ ఉంటాడు. హెయిర్ క‌టింగ్ చేసే స‌మ‌యంలో ఆ బాలుడు కుదురుగా కూర్చోడు. ప్ర‌తిసారి త‌న వ‌ద్ద‌కే ఆ బాలుడు వ‌స్తుండ‌డంతో ఆ బాలుడు ఆ బార్బ‌ర్‌కి ఓ ఫ్రెండ్ అయిపోయాడు.  

కటింగ్ సమయంలో ఒక్కోసారి ఆ బాలుడు కుర్చీలో కూర్చోకుండా... ఆ క‌టింగ్ షాపంతా తిరుగుతూ ఉంటాడు. ఆ బాలుడి వెన‌కే వెళ్లి ఆ బార్బ‌ర్ క‌టింగ్ చేస్తుంటాడు. అయితే, తాజాగా ఆ బాలుడు మ‌రోలా ప్ర‌వ‌ర్తించాడు. త‌న తల్లి క‌టింగ్ షాప్‌కి తీసుకురాగానే అందులోనే నేల‌పై బోర్లా ప‌డుకున్నాడు. దీంతో ఆ బాలుడికి అక్క‌డే క‌టింగ్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న ఆ బార్బ‌ర్.. తాను కూడా నేలపై పడుకుని అక్క‌డే కటింగ్ చేసేశాడు. ఈ సంద‌ర్భంగా తీసిన ఫొటోలకి ఎన‌లేని స్పంద‌న వ‌స్తోంది.
barber

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more