కంచ ఐలయ్యను బెదిరించడాన్ని ఖండిస్తున్నాం: మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జగన్

10-10-2017 Tue 20:41 | Both States
  • ఓ ప్రకటన విడుదల చేసిన మావోయిస్టు నేత
  • భావ ప్రకటనా స్వేచ్ఛను ఎదుర్కొనే హక్కు ఎవరికీ లేదు
  • సంఘ్ పరివార్ హత్యా రాజకీయాల్లో భాగమే ఇదంతా
  • తమ వర్గాన్ని ప్రశ్నించడాన్ని సహించలేకపోతున్న మోదీ, కేసీఆర్
‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ అనే పుస్తకం రాసి వివాదాల్లో పడ్డ పుస్తక రచయిత, మాజీ ప్రొఫెసర్ కంచ ఐలయ్యపై తెలుగు రాష్ట్రాల్లోని ఆర్యవైశ్యులు మండిపడుతున్న విషయం తెలిసిందే. తమ మనోభావాలను దెబ్బతీసేలా ఈ పుస్తకం ఉందని, వెంటనే నిషేధించాలని డిమాండ్ చేస్తుండటం, ఆర్యవైశ్యులకు రెండు రాష్ట్రాల్లో మద్దతు లభిస్తుండటం తెలిసిన విషయమే.

ఈ నేపథ్యంలో కంచ ఐలయ్యను బెదిరించడాన్ని తాము ఖండిస్తున్నామంటూ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జగన్ ఓ ప్రకటన విడుదల చేశారు. కంచ ఐలయ్య రాసిన విషయాలపై అభ్యంతరం ఉంటే చర్చించాలని, ఆయన భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని అన్నారు. సంఘ్ పరివార్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం..హిందూ ఫాసిస్ట్ విధానాలను అమలు చేస్తోందని ఆరోపించారు.

సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్య, కంచ ఐలయ్యపై దాడులు జరగడం సంఘ్ పరివార్ హత్యారాజకీయాల్లో భాగమేనని, ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ లు తమ వర్గాన్ని ప్రశ్నించడాన్ని సహించలేకపోతున్నారని , కంచ ఐలయ్య పుస్తకం లేకుండా చేస్తానని ఏపీ సీఎం చంద్రబాబు అంటున్నారని మావోయిస్టు నాయకుడు జగన్ ఆ ప్రకటనలో విమర్శించారు.
కంచ ఐలయ్యమావోయిస్టు జగన్

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more