ఇది వెంకటేశ్ కోసం అనుకున్న కథ కాదు.. ఆ కథ వేరు!: దర్శకుడు ఓంకార్

10-10-2017 Tue 14:06 | Entertainment
  • 'రాజుగారి గది 2' కథను మొదట వెంకటేశ్ కోసం సిద్ధం చేశా 
  • ఆ కథ వెంకీకి బాగా నచ్చేసింది, అదలాగే వుంది 
  • తర్వాత నాగ్ మూవీ కోసం కొత్త కథను చేసుకోవాల్సి వచ్చింది
  • 'రాజుగారి గది 2' తరువాత కూడా సీక్వెల్స్ ఉంటాయి  
నాగార్జున .. సమంత కీలకమైన పాత్రలను పోషించిన 'రాజుగారి గది 2' సినిమా.. మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కడానికి దారితీసిన పరిస్థితులను గురించి తాజాగా ఐ డ్రీమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓంకార్ చెప్పారు. 'రాజుగారి గది 2' పేరుతో తాను సిద్ధం చేసుకున్న కథను ముందుగా వెంకటేశ్ కి వినిపించడం జరిగిందనీ, ఆయనకి ఆ కథ బాగా నచ్చేసిందని అన్నారు. తాను కమిటైన రెండు సినిమాల తరువాత ఆయన ఈ సినిమా చేస్తానన్నారని చెప్పారు.

ఈ నేపథ్యంలో తాను పీవీపీ గారిని సరదాగా కలిసినప్పుడు ఆయన 'రాజుగారి గది 2' చేద్దామన్నారనీ, దాంతో తాను వెంకటేశ్ కి ఫోన్ చేశానని అన్నారు. అయితే తనకి వినిపించిన కథను మాత్రం తానే చేస్తానంటూ వెంకటేశ్ ఆ కథను లాక్ చేసుకున్నారని చెప్పారు. అప్పుడు అదే టైటిల్ తో .. మలయాళ మూవీ 'ప్రేతమ్' నుంచి తీసుకున్న ఓ పాయింట్ తో కొత్త కథను తయారుచేసుకోవడం జరిగిందని అన్నారు. ఇకపై కూడా ఇంగ్లిష్ మూవీస్ తరహాలో 'రాజుగారి గది'కి సీక్వెల్స్ వస్తూనే వుంటాయని చెప్పుకొచ్చారు.  
venkatesh

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more