హృతిక్‌ రోషన్‌ వెంటే బాలీవుడ్...ఒంటరైన కంగన

10-10-2017 Tue 08:57 | Entertainment
  • ఫేస్ బుక్ లో హృతిక్‌ రోషన్‌ కు మద్దతుగా పోస్టు పెట్టిన ఫర్హాన్ అఖ్తర్
  • ఫర్హాన్ ను అభినందిస్తూ హృతిక్‌ కి మద్దతు తెలిపిన ట్వింకిల్‌ ఖన్నా, యామి గౌతమ్‌, కరణ్‌ జోహార్‌, సోనమ్‌ కపూర్‌, సోనాలి బింద్రే
  • హృతిక్‌ కి మద్దతు పలికిన వారిపై మండిపడ్డ కంగనా సోదరి రంగోలి
గత కొంతకాలంగా బాలీవుడ్ ను హృతిక్‌ రోషన్‌, కంగనా రనౌత్‌ ల వివాదం పట్టికుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న హృతిక్‌ తాజాగా మౌనం వీడడంతో బాలీవుడ్ సెలబ్రిటీలంతా హృతిక్‌ కే మద్దతు పలుకుతున్నారు. ఈ మేరకు హృతిక్‌ రోషన్ కు మద్దతునిస్తూ ఫర్హాన్‌ అఖ్తర్ ఫేస్ బుక్ లో ఒక పోస్టు పెట్టాడు.

"నా సహనటుడు ఓ అమ్మాయి పట్ల ఇంత నీచంగా ప్రవర్తించాడంటే నమ్మను. ఈ విషయంపై మాట్లాడే హక్కు నాకు లేదు. దీనిని సైబర్‌ క్రైమ్‌ అధికారులే పరిష్కరిస్తారు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. సమాజంలో ఎప్పుడూ మహిళలే అన్యాయానికి గురవుతుంటారు. కొన్ని ఘటనల్లో ఇది వాస్తవమే.

కానీ ప్రతీ విషయంలో పురుషుడిదే తప్పంటే మాత్రం నేను అంగీకరించను. పురుషులపై కూడా అకృత్యాలు జరిగాయి. వారూ ఎంతో అనుభవించారు. ఈ వాస్తవాన్ని న్యాయస్థానాలు కూడా ఒప్పుకొన్నాయి. కానీ హృతిక్‌ విషయంలో జరిగే అన్యాయాన్ని సహించలేక స్పందించాల్సి వస్తోంది. కంగన, హృతిక్‌ వివాదాన్ని మీడియా చూపించిన తీరు సరైనది కాదు. కేవలం ఓ యువతి (కంగన) చేస్తున్న ఆరోపణలతోనే పేరున్న పాత్రికేయులు తప్పు హృతిక్‌ దేనని తప్పు పడుతున్నారు. ఇది ఎంత వరకు సమంజసం?’ అంటూ ప్రశ్నించాడు.

దీనికి అక్షయ్ కుమార్ భార్య, సినీనటి ట్వింకిల్‌ ఖన్నా, యామి గౌతమ్‌, కరణ్‌ జొహార్‌, సోనమ్‌ కపూర్‌, సోనాలి బింద్రేలు మద్దతు తెలిపారు. అంతే కాకుండా వారంతా హృతిక్‌ కి మద్దతుగా ట్వీట్లు చేశారు. దీనిపై కంగనా రనౌత్ సోదరి రంగోలీ మండిపడింది. ఫర్హాన్‌ ను సమర్థించిన వారిని ఉద్దేశిస్తూ, ‘డియర్‌ ఫర్హాన్‌.. మీరు కేవలం రోషన్‌ కుటుంబానికి సపోర్ట్‌ చేస్తూ ఈ పోస్ట్‌ రాయకుండా ఉండి ఉంటే అభినందించే దాన్ని. మొత్తం చిత్ర పరిశ్రమ కంగనకు వ్యతిరేకంగా నిలబడినా ఆమె నిలదొక్కుకోగలదు.’ అంటూ ట్వీట్‌ చేసింది. 
hrutik roshankanganacontroversyfarhan aktar

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more