చిరంజీవి గారంటే నాకు ప్రాణం.. నాలో ఇంజెక్ట్ అయిపోయారు: ‘జోష్’ రవి

09-10-2017 Mon 19:30 | Entertainment
  • నా బలాలు బలహీనతలు అన్నీ చిరంజీవిగారే
  • ఇమిటేట్ చేయడానికి కారణం .. ఆయన్ని నేను అంతగా అభిమానిస్తా
  • చిరంజీవిగారి యాక్టింగ్ లో నాకో ఫైర్ కనబడుతుంది
మెగాస్టార్ చిరంజీవిని హాస్యనటుడు ‘జోష్’ రవి అనుకరిస్తాడని అంటారు. ఇదే విషయాన్ని  ప్రస్తావిస్తూ, అసలు, చిరంజీవిని ఎందుకు అనుకరిస్తాననే విషయాన్ని ‘ఐడ్రీమ్స్’ ఇంటర్వ్యూలో రవి స్పష్టంగా చెప్పాడు. ‘చిరంజీవి గారంటే నాకు ప్రాణం. ఇండస్ట్రీకి రాకముందే నాలో చిరంజీవి గారు ఇంజెక్ట్ అయిపోయారు. నేను ఆయన్ని అంతగా ప్రేమించాను. తెల్లవారుజామున రెండు మూడు గంటల వరకు.. చిరంజీవిగారి పోస్టర్లను కట్ చేసి నాకు నచ్చిన పోస్టర్లను గోడకు అంటించుకునేవాడిని. సౌండ్స్ కు.. మా అమ్మ కంగారు పడి లేచేది. ఇదంతా మా అమ్మకు తెలియకుండా చేసే వాడిని...  ఓ రోజు తెల్లవారుజామున మూడు గంటలకు మా అమ్మ లేచి అలానే చూస్తూ కూర్చుంది. ‘ఏంటిరా ఈ పిచ్చి నీకు..చిరంజీవిని నువ్వు ఇంతగా ప్రేమిస్తున్నావని ఆయనకు తెలిస్తే ఎంతగా ఆనందిస్తారో!’ అని మా అమ్మ నాతో అనేది.

ఈ సంఘటన తలచుకుంటే ఇప్పటికీ నాకు ఆనందంగా ఉంటుంది. మన కోరిక బలంగా ఉంటే, ఏదైనా మనం సాధించగలం. నాకు సినిమా తప్పా ఇంకోటి తెలియదు. నేను అదే చేస్తాను. చిరంజీవిగారిని ఇమిటేట్ చేయడానికి కారణం .. ఆయన్ని నేను అంతగా అభిమానిస్తున్నాను. కష్టపడి పైకి రావడమంటే నాకు తెలిసి చిరంజీవిగారే. ఒక సామాన్యమైన వ్యక్తి ఓ గొప్ప స్థాయికి వెళ్లడానికి ఉదాహరణ చిరంజీవి గారు.

నేను పెరిగిన వాతావరణంలో అందరూ చిరంజీవిగారి ఫ్యాన్సే. అందరి హీరోల సినిమాలు చూస్తా, వారితో నటించాలని నాకు ఉంది. కానీ, చిరంజీవిగారి యాక్టింగ్ లో నాకో ఫైర్ కనబడుతుంది. నా బలాలు, బలహీనతలు అన్నీ చిరంజీవిగారే. నాకు ఏదైనా బాధ కలిగితే చిరంజీవి గారి సినిమాలు చూస్తాను. చిరంజీవి గారిని నాకు తెలియకుండానే అనుకరిస్తా..ఇకపై తగ్గించుకుంటాను’ అని ‘జోష్’ రవి చెప్పుకొచ్చాడు.
చిరంజీవి‘జోష్’ రవి

More Telugu News

తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more