అందంగా మీసాలు పెంచుకున్నాడని దళిత యువకుడిపై దాడి.. కత్తిపోటు

09-10-2017 Mon 17:50 | National
  • గుజ‌రాత్‌లోని గాంధీన‌గ‌ర్ లింబోద‌ర‌లో మరో దారుణ ఘటన 
  • 17 ఏళ్ల మ‌హేరియాకు తీవ్రగాయాలు
  • అట్రాసిటీ యాక్ట్ కింద దుండ‌గుల‌పై కేసు న‌మోదు
  • ఆందోళనకు దిగుతోన్న దళితులు
గుజ‌రాత్‌లోని గాంధీన‌గ‌ర్ లింబోద‌ర‌లో మీసం అందంగా పెంచుకున్నాడ‌ని ఓ ద‌ళిత యువ‌కుడిపై గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు దాడి చేసి క‌త్తితో పొడిచి పారిపోయారు. ఈ గ్రామంలో కొన్ని రోజుల వ్య‌వ‌ధిలోనే ఇటువంటి దారుణ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం ఇది మూడవ సారి. 17 ఏళ్ల  మ‌హేరియా అనే ద‌ళిత యువ‌కుడు అందంగా మీసాలు పెంచుకుని తిరుగుతున్నాడు. అది చూసి ఓర్వ‌లేక కొంద‌రు యువ‌కులు ఈ దారుణానికి పాల్ప‌డ్డార‌ని, కత్తితో మహేరియా వీపుపై పొడిచేశారని పోలీసులు తెలిపారు.

కొన్ని రోజుల క్రితం కూడా త‌మ‌ కుమారుడిపై కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు దాడి చేశార‌ని, అయితే, తాము అప్పట్లో పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌లేద‌ని మ‌హేరియా త‌ల్లిదండ్రులు చెప్పారు. ప్ర‌స్తుతం మ‌హేరియా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. అత‌డి వీపుపై ఏడు కుట్లు ప‌డ్డాయ‌ని వైద్యులు చెప్పారు. ఈ ఘ‌ట‌న‌పై అక్క‌డి పోలీసులు మాట్లాడుతూ.. అట్రాసిటీ యాక్ట్ కింద స‌ద‌రు దుండ‌గుల‌పై తాము కేసు న‌మోదు చేశామ‌ని, వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు.  

ఇదే గ్రామంలో గ‌తంలో ద‌ళిత యువ‌కుల‌పై దాడి చేసిన క్ష‌త్రియ క‌మ్యూనిటీ యువ‌కుల‌పై పోలీసులు ఇప్ప‌టికే కేసులు పెట్టారు. ఈ ఘ‌ట‌న‌పై ఆ గ్రామ స‌ర్పంచ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎల్ల‌ప్పుడూ ప్ర‌శాంతంగా ఉండే త‌మ గ్రామంలో ఉన్న‌ట్టుండి ఇటువంటి ఘ‌ట‌న‌లు ఎందుకు జ‌రుగుతున్నాయో అర్థం కావ‌ట్లేద‌ని వ్యాఖ్యానించారు. ఈ ఘ‌ట‌నపై ద‌ళిత క‌మ్యూనిటీకి చెందిన ప్ర‌జ‌లు ఆందోళ‌న‌లకు దిగుతున్నారు.
sporting moustache

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more