యజ్ఞాలకు రాక్షసులు అడ్డుపడ్డట్టు జగన్ అడ్డుపడుతున్నాడు: మంత్రి దేవినేని

08-10-2017 Sun 16:01 | Both States
  • మీడియా సమావేశంలో దేవినేని
  • పట్టిసీమపై జగన్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలి
  • పట్టిసీమ ద్వారా రూ.8 వేల కోట్ల పంట వచ్చింది
 యజ్ఞాలకు రాక్షసులు అడ్డుపడ్డట్టుగా ప్రాజెక్ట్ లకు జగన్ అడ్డుపడుతున్నాడని ఏపీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పట్టిసీమపై చేసిన వ్యాఖ్యలకు జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పట్టిసీమ కడుతుంటే కోర్టుల్లో కేసులు వేయించారని, రైతులను వైసీపీ నేతలు  రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు.

ఉభయగోదావరి జిల్లాల రైతులు వైసీపీ నేతల మాటలను తిప్పికొడుతున్నారని, పట్టిసీమ ద్వారా రూ.8 వేల కోట్ల పంట వచ్చి రైతులు లబ్ధి పొందారని, దీని ద్వారా 10 వేల కోట్ల పంట రావాలని కోరుకుంటున్నామని దేవినేని ఆకాంక్షించారు. సుజల స్రవంతిలో ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేస్తామని, కృష్ణా జలాలపై ఇరు రాష్ట్రాల అధికారులు కూర్చుని చర్చించుకుంటారని అన్నారు.

ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 882 అడుగులకు, సాగర్ లో నీటిమట్టం 518 అడుగులకు చేరిందని అన్నారు. పులిచింతల ప్రాజెక్ట్ లో 10 టీఎంసీలు, తుంగభద్ర జలాశయంలో 81 టీఎంసీల నీరు నిల్వ ఉందని, పట్టిసీమకు 71 టీఎంసీలకు పైగా నీరు విడుదల జరిగిందని, ప్రకాశం బ్యారేజ్ కు 60కి పైగా టీఎంసీల నీరు వచ్చిందని చెప్పారు.
జగన్పట్టిసీమదేవినేని ఉమ

More Telugu News

తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more