డొనాల్డ్ ట్రంప్ అక్రమ సంబంధం తననెంత నష్టపరిచిందో చెప్పుకున్న మొదటి భార్య ఇవానా!

08-10-2017 Sun 07:08 | International
  • కాపురం చేస్తూనే అక్రమ సంబంధం కొనసాగించిన ట్రంప్
  • 'రైజింగ్ ట్రంప్' పేరిట బుక్ రాసిన ఇవానా
  • 1992లో విడిపోయిన ఇవానా, ట్రంప్
  • ఆపై మరో రెండు పెళ్లిళ్లు చేసుకున్న ట్రంప్
ఓ వైపు తనతో కాపురం చేస్తూ మరోవైపు అక్రమ సంబంధాన్ని నడిపినందునే తన వైవాహిక జీవితం విచ్ఛిన్నమైందని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా వ్యాఖ్యానించారు. తమ పరిచయం, ప్రేమ, పెళ్లి, విడాకుల వరకూ జరిగిన సంఘటనలపై ఆమె 'రైజింగ్ ట్ర్రంప్' పేరిట ఓ పుస్తకాన్ని రాశారు. వచ్చే వారంలో మార్కెట్లోకి విడుదల కానున్న ఈ పుస్తకంలో ఇవానా పలు కీలక విషయాలను వెల్లడించారు.

తన పెళ్లి బంధం ముగియనుందని డిసెంబర్ 1989లోనే తెలుసుకున్నానని ఇవానా ఈ పుస్తకంలో తెలిపింది. ఒక రోజు ఓ అమ్మాయి తన ఇంటికి వచ్చి, తన పేరు మార్లా అని పరిచయం చేసుకుందని, తన భర్తను ప్రేమిస్తున్నానని, విషయం మీ దాకా వచ్చిందా? అని అడిగిందని తెలిపింది. దీంతో తాను ఎంతో ఆగ్రహంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలని అరిచానని, భర్తంటే తనకెంతో ప్రేమని చెప్పానని, కానీ ఆ షాక్ నుంచి మాత్రం తేరుకోలేక పోయానని అన్నారు.

ఓ రెస్టారెంట్ లో పరిచయం అయిన ట్రంప్, తనను ఎంతో బాగా చూసుకునేవారని, అయితే, మార్లాతో ట్రంప్ అక్రమ సంబంధం పెట్టుకున్న తరువాత మాత్రం తన మనసు వికలమైందని చెప్పుకొచ్చారు. తామిద్దరం విడిపోయిన తరువాత తమ బిడ్డ డొనాల్డ్ జూనియర్, చాలా కాలం తండ్రితో మాట్లాడలేదని, ప్రస్తుతం తామిద్దరం స్నేహితుల్లా ఉన్నామని అన్నారు. ట్రంప్ కు బదులు తన కుమార్తె ఇవాంకా ట్రంప్ అమెరికాకు అధ్యక్షురాలైతే బాగుండేదని చెప్పారు.

కాగా, ట్రంప్, ఇవానాల వివాహం 1977లో జరిగింది. ఆపై 1990 ప్రాంతంలో ట్రంప్, మార్లా మధ్య వివాహేతర సంబంధంపై పత్రికల్లో సంచలన కథనాలు వచ్చాయి. ‘బెస్ట్‌ సెక్స్‌ ఐ హావ్‌ ఎవర్‌ హాడ్‌’ పేరిట పలు పత్రికలు కథనాలు ప్రచురించాయి. ఆపై 1992లో ఇవానా, ట్రంప్ విడాకులు తీసుకోగా, మరుసటి సంవత్సరమే ట్రంప్, మార్లాను పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత 1999లో మార్లా నుంచి విడాకులు తీసుకున్న ట్రంప్, 2005లో అప్పటి న్యూడ్ మోడల్ మెలానియాను వివాహం చేసుకున్నారు. ఆమే ప్రస్తుతం అమెరికాకు తొలి మహిళగా కొనసాగుతున్నారు.
trumpivanarising trump

More Telugu News

తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more