మరో ఇద్దరు పాకిస్థానీలకు మెడికల్ వీసా జారీ చేయనున్న విదేశాంగ శాఖ!
- ఓపెన్ హార్ట్ సర్జరీకి అర్జీ పెట్టుకున్న మూడేళ్ల పాపకు
- కాలేయ మార్పిడి చికిత్స కోసం ఒకరికి
- వీసాలు జారీ చేయనున్నట్టు ట్వీట్ చేసిన సుష్మా
ఈ విషయాన్ని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు. పాప త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆమె ట్వీట్ చేశారు. అలాగే తన తండ్రి కాలేయ మార్పిడి చికిత్స కోసం మెడికల్ వీసా జారీ చేయాలని నూర్మా హబీబ్ పెట్టుకున్న అర్జీకి కూడా ఆమె సమాధానమిచ్చారు. `సరే.. నూర్మా.. భారత్‌లో నీ తండ్రి చికిత్స కోసం మేం వీసా జారీ చేస్తాం. సర్జరీ బాగా జరిగి, ఆయన ఎక్కువ కాలం జీవించాలని ఆశిస్తున్నాం` అని సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు.