'కోడలి కోసం ఎదురు చూస్తున్నాం' అంటూ ఫ్యామిలీ ఫొటో పోస్టు చేసిన నాగార్జున
- కోడలి కోసం ఎదురు చూస్తున్నాం...ఈ సాయంత్రం తను వచ్చి చేరుతుందంటూ ట్వీట్
- అక్కినేని అభిమానులను ఆకట్టుకుంటున్న ఫ్యామిలీ ఫొటో
- ఇంతకు ముందే చైతన్య, వెంకటేష్ తో దిగిన ఫొటో పోస్టు చేసిన నాగార్జున
ఈ ఉదయం మేనమామ వెంకటేష్, తండ్రి నాగార్జునతో కలసి చైతూ దిగిన ఫోటోను నాగార్జున తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత తమ కుటుంబంతో కలసి దిగిన మరో ఫొటోను పోస్టు చేస్తూ, 'కోడలి కోసం ఎదురు చూస్తున్నాం... ఈ సాయంత్రం తను వచ్చి మా కుటుంబంతో కలుస్తుంది' అని కామెంట్ పెట్టారు. ఈ ఫొటో అక్కినేని అభిమానులను ఆకట్టుకుంటోంది.