ఓయూలో ప్రసంగిస్తూ మరోసారి అగ్గిరాజేసిన ఐలయ్య.. వైశ్యులు, బ్రాహ్మ‌ణుల‌పై తీవ్ర వ్యాఖ్య‌లు!

05-10-2017 Thu 18:36 | Both States
  • అగ్ర‌కులాల అహంకారంపై పుస్త‌కాలు రాస్తోంటే విదేశీ ఏజెంట్ అంటున్నారు
  • కిందికులాల వారికి బ్రాహ్మ‌ణులు, కోమ‌ట్ల కంటే వంద‌రెట్లు ఎక్కువ జ్ఞానం ఉంది
  • సరిహద్దుల్లో నిలబడి కిందికులాల వారు దేశాన్ని రక్షిస్తున్నారు 
  • నా ప్రశ్నలకు వైశ్యులు, బ్రాహ్మణులు సమాధానం చెప్పాలి
ఎస్సీ, ఎస్టీ, బీసీల‌ను అవ‌మాన ప‌ర్చిన అగ్ర‌కులాల అహంకారంపై తాను పుస్త‌కాలు రాస్తోంటే త‌న‌ను విదేశీ ఏజెంట్ అని అంటున్నార‌ని కంచ ఐల‌య్య మండిప‌డ్డారు. మౌన దీక్ష వీడిన ఐల‌య్య ఈ రోజు హైద‌రాబాద్ తార్నాక‌లోని ఓయూలో నిర్వ‌హించిన ఇండియ‌న్ ఇంగ్లిష్ డే ఉత్సవాల్లో పాల్గొని ఉద్వేగభ‌రిత ప్ర‌సంగం చేశారు. కిందికులాల వారికి బ్రాహ్మ‌ణులు, కోమ‌ట్ల కంటే వంద‌రెట్లు ఎక్కువ జ్ఞానం ఉంటుంద‌ని ఆయ‌న అన్నారు.

కింది కులాల వారికి తెలివిలేదని, మంచోళ్లు కాద‌ని అగ్ర‌కులాల వారు ఎన్నో మాట‌లు మాట్లాడార‌ని ఐలయ్య తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలంతా స‌రిహ‌ద్దుల్లో నిల‌బ‌డి చైనా దుర‌హంకారాన్ని (ఆర్మీని) గీత దాటి రాకుండా కాపాడుతున్నార‌ని చెప్పారు. వారివ‌ల్లే దేశం సుర‌క్షితంగా ఉంద‌ని అన్నారు. అగ్ర‌కులాల వారు హిందూమతంలో అంద‌రూ ఒక‌టేన‌ని చెబుతూ త‌మ‌ చెప్పుల‌ను కిందికులాల వారితో మోయిస్తార‌ని, త‌మ ముందు కూర్చోవ‌ద్ద‌ని కూడా అహంకారం ప్ర‌ద‌ర్శిస్తార‌ని ఆయ‌న అన్నారు.

తాను ఎన్న‌డూ వైశ్య స్త్రీల‌ను తిట్ట‌లేదని, కానీ వైశ్య స్త్రీలు ఏది నిజ‌మో తెలుసుకోకుండా తాను రాసిన పుస్త‌కంపై నిర‌స‌న తెలుపుతున్నార‌ని ఐలయ్య అన్నారు. ఇది ద్ర‌విడ దేశం అని, ఆవు దేశం కాద‌ని ఐల‌య్య వ్యంగ్యంగా అన్నారు. ఏ దేవుడు చెప్పులు లేకుండా న‌డిచాడో బ్రాహ్మ‌ణులు చెప్పాల‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. కిందికులాల వారు చేసే చెప్పులు లేనిదే అగ్ర‌కులాల వారు కాలు బ‌య‌ట పెట్ట‌బోర‌ని చెప్పారు. వైశ్యులు, బ్రాహ్మ‌ణులు త‌న‌ను క్రిస్టియ‌న్ అంటూ అబ‌ద్ధ‌పు ప్ర‌చారం చేస్తున్నార‌ని చెప్పారు. 
kancha ilaiah

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more