'పుర' ప్రాజెక్టుకు చంద్రబాబు పథకం అని పేరు పెట్టుకోండి: ర‌ఘువీరారెడ్డి సలహా

05-10-2017 Thu 17:54 | Both States
  • నెల‌లోపు ప‌నులు ప్రారంభించ‌క‌పోతే పార్టీల‌కు అతీతంగా పోరాటం
  • కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలో 187 కోట్ల రూపాయ‌ల‌తో  ప్రారంభించాం
  • మూడు సంవ‌త్స‌రాల లోపు ఈ ప‌నులు పూర్తి చేయాలి
  • ఈ ప్రాజెక్టుని నిర్ల‌క్ష్యం చేస్తున్నారు
కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలో 187 కోట్ల రూపాయ‌ల‌తో  ప్రారంభించిన 'పుర‌' ప్రాజెక్టు పూర్తి చేస్తే క‌మీష‌న్లు రావు కాబ‌ట్టి దీనిని ముందుకు తీసుకుపోరా? అని ఏపీసీసీ అధ్యక్షుడు ర‌ఘువీరారెడ్డి ప్రశ్నించారు. కావాలంటే, ఈ ప్రాజెక్టుకు 'పుర' అని పేరు తీసేసి 'చంద్ర‌న్న ప‌థ‌కం' అని పెట్టుకున్నా త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేదని, దాన్ని మాత్రం పూర్తి చేయాల‌ని అన్నారు. ఈ రోజు ఉద‌యం మైల‌వ‌రం కాంగ్రెస్ నాయ‌కుల ఆహ్వానం మేర‌కు ర‌ఘువీరారెడ్డి, పీసీసీ నాయ‌కులు ఇబ్ర‌హీంప‌ట్నంలోని పుర ప్రాజెక్టు పైలా‌న్‌, పుర ప్రాజెక్టు ప‌నుల‌ను ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా ర‌ఘువీరారెడ్డి మాట్లాడుతూ.. చంద్ర‌బాబుకు ఈ మ‌ధ్య‌న ఓ వ్యాధి వ‌చ్చిందని అంద‌రూ అంటున్నారని అన్నారు. అదేంటంటే, ప్ర‌తి ప‌థ‌కానికి చంద్ర‌బాబు అనే పేరు పెట్టుకునే వ్యాధి వ‌చ్చింద‌ని ఎద్దేవా చేశారు. ఈ రోజు ఆల్టిమేటం ఇవ్వ‌డానికి వ‌చ్చామ‌ని, నెల రోజులలోపు పుర ప్రాజెక్ట్ ప‌నులు ప్రారంభం కావాలని డిమాండ్ చేశారు. మూడు సంవ‌త్స‌రాల లోపు ఈ ప‌నులు పూర్తి చేయాల‌ని కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున డిమాండ్ చేస్తున్నామ‌ని చెప్పారు.
 
ఈ ప్రాజెక్ట్ ను ద‌క్కించుకున్న కాంట్రాక్ట‌ర్‌తో మాట్లాడితే త‌మ‌కు డ‌బ్బు రిలీజ్ చేస్తే ప‌నులు రేపే ప్రారంభిస్తామంటున్నారని తెలిపారు. నెల‌లోపు ప‌నులు ప్రారంభించ‌క‌పోతే పార్టీల‌కు అతీతంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున కొండ‌ప‌ల్లి, ఇబ్ర‌హీంప‌ట్నంల‌లోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఉద్య‌మాన్ని తీసుకువెళ‌తామ‌ని హెచ్చ‌రించారు. స్థానిక బంజ‌రా మ‌హిళాల స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై కూడా కాంగ్రెస్ పార్టీ పొరాడుతుంద‌న్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ప‌ట్ట‌ణంలో ఉన్న‌టువంటివి అన్ని సౌక‌ర్యాలు వ‌స్తాయి అన్నారు. ఈ ప్రాజెక్టుని నిర్ల‌క్ష్యం చేస్తున్నారు అన్నారు.
ర‌ఘువీరారెడ్డి

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more