trumph: నువ్వు అందగత్తెవి.. నేను డబ్బున్నవాడిని!: హాలీవుడ్ నటికి గతంలో ట్రంప్ ప్రపోజల్

  • సల్మాహయక్, కేండిస్ బెర్జన్, ఎమ్మా థాంప్సన్ లకు ట్రంప్ పెళ్లి ప్రతిపాదనలు
  • తనకు కూడా ప్రపోజ్ చేశాడన్న బ్రూక్ షీల్డ్స్
  • రెండో భార్యకు విడాకులివ్వగానే ఫోన్
  • తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి తప్పించుకున్న నటి 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కు అందగత్తెల వీక్ నెస్ ఉందన్న సంగతి పలు కథనాల ద్వారా వెల్లడైన సంగతి తెలిసిందే. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యల టేపులు, ఆయన సన్నిహితుల సంభాషణలు ట్రంప్ బలహీనతలను బయటపెడుతుంటాయి. వాటికి బలాన్నిస్తూ హాలీవుడ్ తారలు సల్మాహయక్, కేండిస్ బెర్జన్, ఎమ్మా థాంప్సన్ వంటి వారికి పెళ్లి ప్రతిపాదనలు పంపారని వారే వెల్లడించారు. అయితే తాము ఆయనను తిరస్కరించినట్టు వారే తెలిపారు.

తాజాగా వారి సరసన ప్రముఖ హాలీవుడ్‌ నటి బ్రూక్‌ షీల్డ్స్‌ కూడా చేరారు. డొనాల్డ్ ట్రంప్ తనకు కూడా ప్రపోజ్ చేశారని ఆమె బయటపెట్టారు. అయితే తాను ఆయన ప్రతిపాదనను తిరస్కరించానని చెప్పారు. ట్రంప్ తన రెండో భార్య మార్లా మేపుల్స్‌ నుంచి విడాకులు తీసుకున్న వెంటనే తనకు ఫోన్‌ చేశాడని ఆమె చెప్పారు. అప్పుడు తాను ఒక సినిమా షూటింగ్‌ లో ఉన్నానని ఆమె గుర్తు చేసుకున్నారు.

"నువ్వు అమెరికన్ల హృదయసామ్రాజ్ఞివి.. నేను అమెరికాలోనే అత్యంత ధనవంతుడిని.. మనిద్దరం కలిస్తే అందరికీ సంతోషం" అంటూ డేట్‌ కి రావాలని ప్రపోజ్‌ చేశాడని ఆమె వెల్లడించింది. అయితే తనకు బాయ్‌ ఫ్రెండ్‌ ఉన్నాడని చెప్పి ఆ ప్రతిపాదనను తిరస్కరించానని ఆమె చెప్పింది.  
trumph
brook shields
Emma Thompson
salma hyak
candis berzan

More Telugu News