అనుమానాస్పద స్థితిలో ఏపీ క్యాడర్ మహిళా ఎస్పీ కుమారుడి మృతి!
Add ap7am to your home Screen

అనుమానాస్పద స్థితిలో ఏపీ క్యాడర్ మహిళా ఎస్పీ కుమారుడి మృతి!

  • నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్న రత్నకుమారి కుమారుడు రోషన్
  • అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
  • అన్ని కోణాల్లో విచారిస్తున్నామని చెప్పిన పోలీసులు
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్స్ లో విషాదం చోటు చేసుకుంది. ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారిణి, ఎస్పీ రత్నకుమారి కుమారుడు రోషన్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. నిన్న కోర్టు పనుల నిమిత్తం రత్నకుమారి మంగళగిరికి వెళ్లగా, నిద్రమాత్రలు మింగిన రోషన్, మృతి చెందినట్టు ప్రాథమిక సమాచారం. అతని మృతదేహం మంచం కింద పడివుంది. గత కొంతకాలంగా రోషన్ మానసిక ఒత్తిడిలో ఉన్నట్టు మృతదేహాన్ని సందర్శించి, విచారణ ప్రారంభించిన ఏసీపీ మురళీ వెల్లడించారు.

రోషన్ కు ఆరోగ్యం బాగాలేదని, ఆ కారణంతోనే డిప్రషన్ లో ఉన్నాడని, అదే నిద్రమాత్రలు మింగేందుకు కారణమై ఉండవచ్చని చెప్పిన ఆయన, కేసును అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నామని, అతని కాల్ డేటా పరిశీలిస్తున్నామని అన్నారు. రోషన్ మృతిని అనుమానాస్పద మరణం కింద నమోదు చేశామని, రత్నకుమారి ఇంటికి ఎవరైనా వచ్చారా? అన్న విషయాన్ని నిర్ధారించేందుకు సీసీటీవీ కెమెరా ఫుటేజ్ లను పరిశీలిస్తున్నామని తెలిపారు. కాగా, కుమారుడి మరణంతో చలించిపోయిన రత్నకుమారిని పలువురు సహోద్యోగులు ఓదార్చారు.
SP ratnakumkari
roshan
sucide

More Telugu News